యంగ్ టైగర్ ఎన్టీఆర్ నుంచి రాబోతున్న చిత్రాలతో అభిమానులకు పండగే. ఓ వైపు ఎన్టీఆర్ ఆర్ఆర్ఆర్ చిత్రంలో రాజమౌళి దర్శత్వంలో నటిస్తుండగా.. త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తదుపరి చిత్రానికి సన్నాహకాలు జరుగుతున్నాయి. త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెకెక్కబోయే చిత్రం వచ్చే ఏడాది ప్రారంభం కానుంది. 

ఈ చిత్రానికి 'అయినను పోయిరావలె హస్తినకు' అనే టైటిల్ పరిశీలిస్తున్నట్లు టాక్. త్రివిక్రమ్ ఈ చిత్ర కథని పొలిటికల్ బ్యాక్ డ్రాప్ లో రూపొందించబోతున్నట్లు తెలుస్తోంది. తాజాగా ఈ మూవీలో ఎన్టీఆర్ పాత్ర గురించి ఆసక్తికర వార్తలు వస్తున్నాయి. 

మాజీ భార్యతో కలిసి జీవిస్తున్న స్టార్ హీరో.. వైరల్ అవుతున్న వీడియోలు

ఈ చిత్రంలో ఎన్టీఆర్ యంగ్ కార్పొరేట్ దిగ్గజంగా కనిపించబోతున్నాడట. ఎన్టీఆర్ ని త్రివిక్రమ్ స్టైలిష్ బిజినెస్ మ్యాన్ లుక్ లో చూపించబోతున్నట్లు తెలుస్తోంది. కథ పొలిటికల్ బ్యాక్ డ్రాప్ లో ఉంటే.. హీరో పాత్ర బిజినెస్ కు సంబంధించినది. అంటే కథలో భాగంగా ఎన్టీఆర్ బిజినెస్ ని వదలిపెట్టి పాలిటిక్స్ లోకి వస్తాడేమో. ఇది ఎన్టీఆర్ అభిమానులకు పండగలాంటి వార్తే. యంగ్ బిజినెస్ మ్యాన్ లుక్ లో ఎన్టీఆర్ ఎలా ఉంటాడో ఫ్యాన్స్ ఇక ఊహించుకోవచ్చు. 

గత ఏడాది సూపర్ స్టార్ మహేష్ బాబు సీఈవోగా, కార్పొరేట్ సంస్థ అధినేతగా స్టైలిష్ లుక్ లో కనిపించాడు. తన స్నేహితుడి కోసం మహేష్ అద్దాల మేడ వదిలిపెట్టి చెట్టుకిందికి వచ్చిన సంగతి తెలిసిందే.