మాజీ భార్యతో కలిసి జీవిస్తున్న స్టార్ హీరో.. వైరల్ అవుతున్న వీడియోలు
ఇండియన్ సూపర్ హీరో హృతిక్ రోషన్ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. హృతిక్ కి లేడీస్ లో విపరీతమైన ఫాలోయింగ్ ఉంది. ఇదిలా ఉండగా హృతిక్ రోషన్ ప్రస్తుతం క్రిష్ 4 సన్నాహకాల్లో ఉన్నాడు.
ఇండియన్ సూపర్ హీరో హృతిక్ రోషన్ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. హృతిక్ కి లేడీస్ లో విపరీతమైన ఫాలోయింగ్ ఉంది. ఇదిలా ఉండగా హృతిక్ రోషన్ ప్రస్తుతం క్రిష్ 4 సన్నాహకాల్లో ఉన్నాడు. కరోనా ప్రభావం లేకుంటే ఈ పాటికి క్రిష్ 4 మొదలై ఉండాల్సింది.
ఇక హృతిక్ వ్యక్తిగత జీవితంలో ఎన్నో ఒడిదుడుకులు ఉన్నాయి. కంగనా రనౌత్ తో ప్రేమ లేఖల వ్యవహారం రచ్చకెక్కింది. అదే సమయంలో హృతిక్ రోషన్ తన భార్య సుసాన్నె ఖాన్ నుంచి విడిపోయాడు. 2000లో వివాహ బంధంతో ఒక్కటైన సుసాన్నె ఖాన్, హృతిక్ రోషన్ జంట 2014లో విడిపోయారు.
ఇటీవల కొంతకాలంగా వీరిద్దరూ తమ మధ్య విభేదాలని పక్కన పెట్టి కలసి మూవ్ అవుతున్నారు. బాల్యంలో పిల్లలు తల్లిదండ్రులని మిస్ కాకూడదనే ఉద్దేశంతోనే హృతిక్, సుసాన్నె స్నేహంగా మెలుగుతున్నారు. తమ పిల్లలతో కలసి సినిమాలకు, షికారులకు వెళుతున్న సంగతి తెలిసిందే.
తాజాగా సుసాన్నె ఖాన్, హృతిక్ మరో అడుగు ముందుకు వేశారు. ప్రస్తుతం వీరిద్దరూ తమ పిల్లలతో కలసి ఒకే ఇంట్లో జీవిస్తున్నారు. ఇటీవల హృతిక్ రోషన్ తల్లిదండ్రుల మ్యారేజ్ యానవర్సరీ జరిగింది.
ఈ సందర్భంగా జరిగిన పార్టీలో హృతిక్, సుసాన్నె పాల్గొన్నారు. అంటే కాదు తమ తల్లిదండ్రులకు విషెష్ తెలియజేస్తూ హృతిక్ పియానో వాయించగా వెనుకనే ఉన్న సుసాన్నె పాట పాడింది. ఈ వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మొత్తంగా ఈ జంట తిరిగి తమ బంధాన్ని కొసాగిస్తుండడం అభిమానులకు సంతోషాన్ని ఇస్తోంది.