అర్జున్ రెడ్డి అనంతరం అదే హావభావాలతో మరో కొత్త తరహా లవ్ స్టోరీ వరల్డ్ ఫేమస్‌ లవర్ తో విజయ్ దేవరకొండ ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఇప్పటికే సినిమా టీజర్ కి పాజిటివ్ రెస్పాన్స్ దక్కింది. గతంలో ఎప్పుడు లేని విధంగా సింగిల్ స్క్రీన్ పై నలుగురు హీరోయిన్లతో విజయ్ రొమాన్స్  చేస్తున్నాడు. అదే సినిమాకి మంచి క్రేజ్ తెస్తోంది.  అయితే ఈ మిక్సిడ్ లవ్ స్టోరీ ని కొంత మందియువ హీరోలు రిజెక్ట్ చేసినట్లు తెలుస్తోంది.

దర్శకుడు క్రాంతి మాధవ్ గతంలో ఓనమాలు - మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు వంటి సినిమాలతో దర్శకుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇక ఆ తరువాత సునీల్ తో చేసిన ఉంగరాల రాంబాబు దారుణమైన రిజల్ట్ ని అందుకుంది. ఇక ఎదో కష్టపడి విజయ్ దేవరకొండను వరల్డ్ ఫెమస్ లవ్ స్టోరీతో మెప్పించిన క్రాంతి మాధవ్ అంతకు ముందు కొంత మంది కుర్ర హీరోలను కలిశాడట.

ప్రేమంటే ఒక కాంప్రమైజ్ కాదు.. 'వరల్డ్ ఫేమస్ లవర్' టీజర్!

అందులో సాయి ధరమ్ తేజ్ - శర్వానంద్ లు కూడా ఉన్నట్లు సమాచారం. అయితే ఉంగరాల రాంబాబు తో డిజాస్టర్ అందుకోవడంతో రిస్క్ చేయకూడదని ఒప్పుకోలేదట. మరీ విజయ్ ఏం చూసి ఒప్పుకున్నాడో గాని ఇప్పుడు ఈ వార్త ఇంటర్నెట్ లో వైరల్ గా మారింది. ఇక సినిమాలో క్లయిమాక్స్ సన్నివేశాలు సినిమాలో హైలెట్ గా నిలవనున్నాయట. ఆ సీన్స్ లో విజయ్ దేవరకొండ నట విశ్వరూపం చూస్తారని చిత్ర యూనిట్ నుంచి టాక్ వస్తోంది.

దర్శకుడు క్రాంతి మాధవ్ గతంలో డైరెక్ట్ చేసిన ఓనమాలు - మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు వంటి సినిమాల్లో ప్రధాన పాత్రలకు సంబందించిన నటన అద్భుతంగా ఉంటుంది.  ఇక ఇప్పుడు విజయ్ దేవరకొండను కూడా దర్శకుడు అలానే ప్రజెంట్ చేయబోతున్నట్లు తెలుస్తోంది. సినిమాలో ఎమోషన్ లవ్ సీన్స్ గట్టిగానే ఉన్నట్లు టాక్ వస్తోంది. మరి ఈ సినిమాతో విజయ్ దేవరకొండ ఎంతవరకు సక్సెస్ అందుకుంటాడో చూడాలి. వీలైనంత త్వరగా షూటింగ్ ని పూర్తి చేసి వచ్చే ఏడాది ఫిబ్రవరి 14న సినిమాను విడుదల చేయాలనీ చిత్ర యూనిట్ ప్లాన్ చేసుకుంటోంది.