టాలీవుడ్ సెన్సేషనల్ హీరో విజయ్ దేవరకొండ నటిస్తోన్న తాజా చిత్రం వరల్డ్‌ ఫేమస్‌ లవర్‌. విభిన్న చిత్రాల దర్శకుడు క్రాంతి మాధవ్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో విజయ్‌ దేవరకొండ నాలుగు డిఫరెంట్ వేరియేషన్స్‌లో కనిపించనున్నాడు.

విజయ్‌కి జోడిగా రాశీ ఖన్నా, ఐశ్వర్యా రాజేష్‌, కేథరిన్‌ థ్రెస్సా, ఇసాబెల్లాలు హీరోయిన్లుగా నటిస్తున్నారు. ప్రస్తుతం చిత్రీకరణ జరుపుకుంటున్న ఈసినిమాకు సంబంధించి ప్రమోషన్‌ కార్యక్రమాలు ప్రారంభించారు చిత్రయూనిట్. ఇప్పటికే సినిమాలోని నాలుగు ప్రేమ కథలకు సంబంధించిన నాలుగు పోస్టర్లను రిలీజ్ చేశారు. 

తాజాగా సినిమా టీజర్ ని విడుదల చేశారు. 'ప్రేమంటే ఒక కాంప్రమైజ్ కాదు.. ప్రేమంటే ఒక సాక్రిఫైజ్.. ప్రేమలో దైవత్వం ఉంటుంది..  అవేవీ నీకు అర్ధం కావు' అంటూ రాశిఖన్నా చెప్పే డైలాగ్ తో టీజర్ మొదలైంది. ఎప్పటిలానే విజయ్ తన రఫ్ లుక్ తో ఆకట్టుకున్నాడు. టీజర్ లో నలుగురు హీరోయిన్లు తళుక్కున మెరిసారు.

''టాలెంట్ లేకుండా ఎంతమందితో పడుకుంటే ఏంటి..?''

టీజర్ ని బట్టి నేటితరం యూత్ కి కనెక్ట్ అయ్యే అన్ని అంశాలు ఈ సినిమాలో చూపించినట్లుగా ఉన్నారు. టీజర్ మొత్తానికి బ్యాక్ గ్రౌండ్ స్కోర్ హైలైట్ గా నిలిచింది. రొమాంటిక్‌ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమాను ప్రేమికుల రోజు కానుకగా ఫిబ్రవరి 14న రిలీజ్‌ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు.

క్రియేటివ్‌ కమర్షియల్స్‌ బ్యానర్‌పై సీనియర్‌ నిర్మాత కేయస్ రామారావు సమర్పణ ఏ వల్లభ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. మలయాళ సంగీత మాంత్రికుడు గోపీ సుందర్‌ సంగీతమందిస్తున్నాడు.