టాలీవుడ్ సెన్సేషనల్ హీరో విజయ్ దేవరకొండ 'అర్జున్ రెడ్డి' సినిమాతో ఎంత ఫేమస్ అయ్యాడో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు బాలీవుడ్ లో కూడా ఇతడికి క్రేజ్ పెరిగిపోయింది. అయితే 'నోటా', 'డియర్ కామ్రేడ్' సినిమాలు విజయ్ క్రేజ్ కి బ్రేకులు వేశాయి.

దీంతో కెరీర్ విషయంలో విజయ్ జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. ప్రస్తుతం విజయ్ 'వరల్డ్ ఫేమస్ లవర్' అనే సినిమాలో నటిస్తున్నాడు. క్రాంతి మాధవ్ డైరెక్ట్ చేస్తోన్న ఈ సినిమాని రొమాంటిక్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాలో రాశిఖన్నా, కేథరిన్ త్రెసా, ఐశ్వర్య రాజేష్, ఇసా బెల్లాలు హీరోయిన్లుగా నటిస్తున్నారు.

తమిళనాడు సీఎం విజయ్.. ఫ్యాన్స్ అత్యుత్సాహం!

ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ సినిమా ఫిబ్రవరి 14న ప్రేక్షకుల ముందుకు రానుంది. దీంతో చిత్రబృందం ప్రమోషన్ కార్యక్రమాలు షురూ చేసింది. ఇందులో భాగంగా తాజాగా సినిమా టీజర్ ని విడుదల చేశారు. ఇందులో అర్జున్ రెడ్డి షేడ్స్ ఎక్కువగా కనిపిస్తున్నాయనే విమర్శలు వినిపిస్తున్నాయి.

కానీ ఓవరాల్ గా మాత్రం టీజర్ కి మంచి రెస్పాన్స్ వస్తోంది. అయితే ఇప్పుడు టీజర్ లో విజయ్ దేవరకొండ పేరు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. అందరికీ విజయ్ దేవరకొండగా మాత్రమే తెలిసిన ఈ హీరో పేరుని టీజర్ లో దేవరకొండ విజయ్ సాయి అని వేశారు.

విజయ్ దేవరకొండ పూర్తి పేరు ఇదే అయినప్పటికీ సినిమాల్లో మాత్రం విజయ్ దేవరకొండగానే ఫేమస్ అయ్యాడు. కానీ ఇప్పుడు మాత్రం తన పేరుని మార్చి స్క్రీన్ పై వేశాడు. గత సినిమాల రిజల్ట్స్ తో తన పేరులో మార్పులు చేసి ఉంటాడనే కామెంట్స్ వినిపిస్తున్నాయి.