తమిళనాట సినిమా ఇండస్ట్రీకి రాజకీయాలు ఎంత దగ్గరగా ఉంటాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అభిమానులు తమ ఫేవరేట్ హీరోలను రాజకీయ నాయకులుగా చూడాలనుకుంటారు. ఎంతోకాలంగా రజినీకాంత్ ని రాజకీయాల్లోకి రావాలని ఫ్యాన్స్ ఒత్తిడి చేస్తే.. ఇప్పటికి ఆయన పాలిటిక్స్ లోకి ఎంట్రీ ఇచ్చారు.

అది కూడా పూర్తి స్థాయిలో కాదు. ఇక అజిత్ ని ఆయన అభిమానులు రాజకీయాల్లో చూడాలనుకుంటున్నారు. కానీ అతడికి పాలిటిక్స్ ఇంటరెస్ట్ లేదని చెప్పేశారు. ఇక విజయ్ ఫ్యాన్స్ ఏకంగా ఆయన్ని సీఎం చేసేశారు.

బాలయ్య హీరోయిన్ పరిస్థితి ఏంటి ఇలా.. ఆ లాయర్ కూడా అలాంటివాడే!

ఆల్రెడీ తమిళనాడుకి సీఎం ఉన్నారు కదా..? మరి విజయ్ ఎలా సీఎం అవుతాడని అనుకుంటున్నారా..? మనందరికీ తమిళనాడు ముఖ్యమంత్రి ఎడపాటి పళనిసామినే.. అయితే విజయ్ అభిమానులకు మాత్రం ఆయనే సీఎం. విజయ్ కి తమిళనాడు దాటి ఇతర రాష్ట్రాల్లోనే కాదు విదేశాల్లో కూడా అభిమానులు భారీగా ఉన్నారు.

ముఖ్యంగా తమిళనాడులో విజయ్ ని ఆయన అభిమానులు ముఖ్యమంత్రిగా చూడాలని కలలు కంటుంటారు. ఆయన అభిమానులు విజయ్ కి తన రాజకీయ రంగప్రవేశం గురించి గుర్తు చేస్తూనే ఉంటున్నారు.

తాజాగా మరోసారి తమిళనాడు సీఎం విజయ్ అంటూ పోస్టర్లను ప్రింట్ చేసి ప్రచారం చేస్తున్నారు. ఆ పోస్టర్ లో ట్యాగ్ లా కలెక్షన్ మాస్టర్ అని పేర్కొన్నారు. ఈ పోస్టర్ల కారణంగా విజయ్ మరోసారి వార్తల్లోకెక్కారు.