పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం రీఎంట్రీ చిత్రం వకీల్ సాబ్ లో నటిస్తున్న సంగతి తెలిసిందే. కరోనా లేకుంటే మేలో వకీల్ సాబ్ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చేది.  ఇది మాత్రమే కాక పవన్ పలు చిత్రాలకు సైన్ చేశారు. క్రిష్ దర్శత్వంలో భారీ బడ్జెట్ చిత్రంలో నటిస్తున్నాడు. 

అలాగే హరీష్ శంకర్ దర్శకత్వంలో కూడా మరో చిత్రంలో నటించాల్సి ఉంది. ఇదిలా ఉండాగా క్రిష్ తెరకెక్కిస్తున్న చిత్రం పీరియాడిక్ మూవీ. మొఘలాయుల కాలానికి సంబంధించిన కథ. ఈ చిత్రం గురించి రోజుకొక ఆసక్తికర వార్త  వెలుగులోకి వస్తోంది. 

విజయ్ దేవరకొండతో ఆ సీన్ నాకు ఇష్టం లేదు.. అమ్మకు చెప్పా, ఏడ్చేశా: రాశి ఖన్నా

తాజా సమాచారం మేరకు ఈ చిత్రంలో తమిళ క్రేజీ యంగ్ హీరో శివకార్తికేయన్ కీలక పాత్రలో నటించబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. దర్శకుడు క్రిష్ ఈ చిత్రం గురించి శివకార్తికేయన్ కు వివరించగా అతడు సుముఖత వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. 

దర్శకుడు క్రిష్ నుంచి ఇది ఒకరకంగా షాకింగ్ సర్ ప్రైజ్ అని చెప్పొచ్చు. శివకార్తికేయన్ తమిళంలో మంచి క్రేజ్ ఉన్న హీరో. అలాంటి హీరో పవన్ 27లో నటిస్తున్నాడు అంటూ పవర్ ఫుల్ రోల్ అయి ఉంటుందని అభిమానులు అంచనా వేస్తున్నారు.