యంగ్ హీరో నితిన్ ప్రస్తుతం భీష్మ చిత్రంలో నటిస్తున్నాడు. శ్రీనివాస కళ్యాణం చిత్రం నిరాశపరిచిన తర్వాత నితిన్ కొంత గ్యాప్ తీసుకుని భీష్మ మూవీని ఓకే చేశాడు. వెంకీ కుడుముల దర్శత్వంలో తెరకెక్కుతున్న భీష్మ మూవీ వచ్చే ఏడాది ఫిబ్రవరి 21న విడుదల కానుంది. భీష్మ తర్వాత నితిన్ వరుస చిత్రాలతో బిజీ కానున్నాడు. 

నితిన్ కు యువతలో మంచి క్రేజ్ ఉంది. కెరీర్ లో వరుస పరాజయాలు వేధించినా ఇష్క్ చిత్రంతో తిరిగి పుంజుకున్నాడు. తనకంటూ ప్రత్యేక గుర్తింపు సొంతం చేసుకున్నాడు. నితిన్ కు ఇటీవల ఓ క్రేజీ ఆఫర్ వచ్చిందట. కానీ నితిన్ ఆ ఆఫర్ ని వదిలేసుకున్నట్లు తెలుస్తోంది. 

యంగ్ హీరో నిఖిల్, అల్లు అరవింద్, సుకుమార్ కాంబినేషన్ లో మంగళవారం రోజు ఓ చిత్రానికి ప్రకటన వచ్చింది. సుకుమార్ ఈ చిత్రానికి కథ అందిస్తుండగా, పల్నాటి సూర్య ప్రతాప్ దర్శకత్వం వహించనున్నాడు. 

మొదట ఈ చిత్రంలో నటించేందుకు నితిన్ ని సంప్రదించారట. కానీ తెలియని కారణాల వల్ల నితిన్ ఈ ఆఫర్ ని రిజెక్ట్ చేసినట్లు తెలుస్తోంది. గీతా ఆర్ట్స్ బ్యానర్ లో  సుకుమార్ కథలో నటించే అవకాశాన్ని ఏ హీరో వదులుకోవడానికి ఇష్టపడడు. అందుతున్న సమాచారం ప్రకారం ఆల్రెడీ నితిన్ కొన్ని చిత్రాలకు సైన్ చేయడం వల్లే ఈ ఆఫర్ వదిలేసుకునట్లు తెలుస్తోంది. 

సుకుమార్, అల్లు అరవింద్ లతో హీరో నిఖిల్ చిత్రం.. క్రేజీ కాంబినేషన్ ఖరారు!

2020లో నితిన్ బాగా బిజీ కాబోతున్నాడు. చంద్రశేఖర్ యేలేటి దర్శత్వంలో ఓ చిత్రం, వెంకీ అట్లూరి దర్శకత్వంలో రంగ్ దే చిత్రం, కృష్ణ చైతన్య దర్శకత్వంలో మరో చిత్రంలో నటించబోతున్నాడు. డేట్స్ కుదరకపోవడం వల్లే నితిన్ గీతా ఆర్ట్స్ బ్యానర్ లో చిత్రాన్ని రిజెక్ట్ చేసినట్లు తెలుస్తోంది. మరోవైపు బాలీవుడ్ సూపర్ హిట్ చిత్రం అంధాదున్ రీమేక్ లో నటించాల్సి ఉంది.