యంగ్ హీరో నితిన్ నటించిన లేటెస్ట్ మూవీ భీష్మ. నితిన్ సరైన సమయంలో ఈ చిత్రంతో విజయాన్ని అందుకున్నాడు. నితిన్, రష్మిక మందన జంటగా నటించిన ఈ చిత్రం వెంకీ కుడుముల దర్శకత్వంలో తెరకెక్కింది. అంతకు ముందు వరకు ఛల్ మోహన్ రంగ, లై, శ్రీనివాస కళ్యాణం చిత్రాలతో నితిన్ హ్యాట్రిక్ పరాజయాలు చవిచూశాడు. దీనితో భీష్మ చిత్రం అతడికి ఉపశమనాన్ని కలిగించింది. 

ఇటీవల ఎక్కువగా తెలుగులో హిట్ అయిన చిత్రాలు బాలీవుడ్ లో రీమేక్ అయిపోతున్నాయి. బాలీవుడ్ బడా నిర్మాత కరణ్ జోహార్ కన్ను ప్రస్తుతం భీష్మపై పడిందట. ఈ చిత్రాన్ని రొమాంటిక్ హీరో రణబీర్ కపూర్ తో రీమేక్ చేసే ఆలోచనలో ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. 

ఓ సారి చేతులు కాలాయి.. నితిన్ మళ్ళీ కాల్చుకుంటాడా ?

భీష్మ చిత్రంలో కంటెంట్ వీక్ అయినప్పటికీ వినోదం అద్భుతంగా ఉంటుంది. అందువల్లే కరణ్ జోహార్ ఈ చిత్రాన్ని రీమేక్ చేసే ఉద్దేశంలో ఉన్నట్లు తెలుస్తోంది. రణబీర్ కపూర్ ప్రస్తుతం బ్రహ్మాస్త్ర, శంషేరా లాంటి భారీ చిత్రాల్లో నటిస్తున్నాడు.

బాలీవుడ్ లో ఇటీవల అర్జున్ రెడ్డి, టెంపర్ లాంటి సూపర్ హిట్ చిత్రాలు రీమేక్ అయ్యాయి. జెర్సీ చిత్రం కూడా రీమేక్ అవుతోంది. చూస్తుంటే బాలీవుడ్ వాళ్ళు తెలుగులో హిట్ అయిన ఏ చిత్రాన్ని వదిలిపెట్టేలా లేరు.