Asianet News TeluguAsianet News Telugu

ఓ సారి చేతులు కాలాయి.. నితిన్ మళ్ళీ కాల్చుకుంటాడా ?

యంగ్ హీరో నితిన్ ప్రస్తుతం ఫుల్ జోష్ లో ఉన్నాడు. నితిన్ నటించిన భీష్మ చిత్రం మంచి విజయాన్ని అందుకుంది. ఈ ఏడాది నితిన్ మూడు వరుస చిత్రాల్లో నటించేందుకు రెడీ అవుతున్నాడు.

hero Nithiin to do risk once again
Author
Hyderabad, First Published Mar 18, 2020, 9:28 PM IST

యంగ్ హీరో నితిన్ ప్రస్తుతం ఫుల్ జోష్ లో ఉన్నాడు. నితిన్ నటించిన భీష్మ చిత్రం మంచి విజయాన్ని అందుకుంది. ఈ ఏడాది నితిన్ మూడు వరుస చిత్రాల్లో నటించేందుకు రెడీ అవుతున్నాడు. ఇక త్వరలో పెళ్లి కుడా కాబోతోంది. కరోనా వల్ల నితిన్ వివాహం వాయిదా పడ్డట్లు వార్తలు వస్తున్నాయి. ఇది పక్కన పెడితే ప్రస్తుతం నితిన్ కెరీర్ పరంగా సంతృప్తిగా ఉన్నాడు. 

మీడియం రేంజ్ హీరోల్లో మంచి మార్కెట్ ఉన్న హీరో నితిన్. కాగా నితిన్ తండ్రి సుధాకర్ రెడ్డి నిర్మాతగా, డిస్ట్రిబ్యూటర్ గా ఉన్నారు. కానీ నితిన్ స్వయంగా నిర్మాతగా మారిన చిత్రం అఖిల్. అక్కినేని అఖిల్ డెబ్యూ మూవీ డిజాస్టర్ గా నిలిచింది. అఖిల్ తొలి చిత్రానికి నియంత్రణ లేకుండా డబ్బు ఖర్చు చేశారు. ఆ సినిమా కాస్త ఫ్లాప్ కావడంతో నితిన్ బాగా నష్టపోయాడు. 

ఘోరంగా తిట్టారు.. నీకు పెళ్ళైంది కదా అని చైతు అన్నాడు: సమంత

దీనితో ఇక నితిన్ ప్రొడక్షన్ జోలికి వెళ్లడని అంతా భావించారు. కానీ తాజా సమాచారం మేరకు అఖిల్ హీరోగా నితిన్ మరో చిత్రాన్ని నిర్మించేందుకు రెడీ అవుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. అఖిల్, నితిన్ మంచి స్నేహితులు. అఖిల్ ప్రస్తుతం బొమ్మరిల్లు భాస్కర్ దర్శత్వంలో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ చిత్రంలో నటిస్తున్నాడు. 

ఈ చిత్రం తర్వాత అఖిల్.. స్టార్ డైరెక్టర్ సురేందర్ రెడ్డి దర్శకత్వంలో నటించే అవకాశం ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ చిత్రానికి నితిన్ నే నిర్మాతగా తీసుకోవాలని అఖిల్ భావిస్తున్నాడట. తన వల్ల నితిన్ నష్టపోయాడనే.. ఆ నష్టాన్ని ఈ చిత్రం ద్వారా భర్తీ చేయాలనే ఉద్దేశంతో అఖిల్ ఉన్నట్లు టాక్. మరి నితిన్ నిర్మాతగా మరో సాహసం చేస్తాడా ?

Follow Us:
Download App:
  • android
  • ios