దబంగ్ చిత్రంతో బాలీవుడ్ లోకి మెరుపులా వచ్చిన సోనాక్షి సిన్హా. తొలి చిత్రంతోనే సోనాక్షి సిన్హా  కుర్రకారు హృదయాల్లో గూడు కట్టుకుంది. దబంగ్ తర్వాత నుంచి కమర్షియల్ చిత్రాల్లో నటిస్తూనే వైవిధ్యభరితమైన పాత్రలు కూడా చేస్తోంది. సోనాక్షి సిన్హా మీడియాకు, వివాదాలకు కాస్త దూరంగా ఉంటుంది. 

అయినా కూడాసెలెబ్రిటీల విషయంలో రూమర్స్ సహజం. ఆ మధ్యన సోనాక్షి సిన్హా యంగ్ హీరో జహీర్ ఇక్బాల్ తో డేటింగ్ చేస్తున్నట్లు బాలీవుడ్ మీడియాలో వార్తలు వచ్చాయి. తాజాగా ఓ ఇంటర్వ్యూలో జహీర్ ఇక్బాల్ సోనాక్షితో రిలేషన్ గురించి స్పందించాడు. 

సోనాక్షి, నేను డేటింగ్ చేస్తున్నట్లు వార్తలు చూడగానే నాకు నవ్వొచ్చింది. ఎందుకంటే నా గురించి రూమర్స్ చూడడం అదే తొలిసారి. కాబట్టి ఎలా రియాక్ట్ కావాలో అర్థం కాలేదు అని జహీర్ తెలిపాడు. సోనాక్షి, నేను మంచి స్నేహితులం అని జహీర్ చెప్పుకొచ్చాడు. 

బోల్డ్ షోకి ప్రతిఫలం.. అల్లు అర్జున్ 'పుష్ప'లో శృంగార తార

పార్టీల్లో, పబ్బుల్లో వీరిద్దరూ తరచుగా కనిపించేవారు. సల్మాన్ ఖాన్ బర్త్ డే పార్టీకి కూడా సోనాక్షి, జహీర్ జంటగా హాజరయ్యారు. దీనితో వీరిద్దరి మధ్య ఎఫైర్ సాగుతున్నట్లు ప్రచారం జరిగింది. అందులో ఏమాత్రం వాస్తవం లేదని జహీర్ అంటున్నాడు. ఎందుకంటే నా గురించి, సోనాక్షి గురించి రూమర్స్ వచ్చే సమయంలో తాను మరొక అమ్మాయితో రిలేషన్ లో ఉన్నానని చెప్పుకొచ్చాడు. 


సోనాక్షి, న నాగురించి వార్తలు చూడగానే నా ప్రియురాలు కూడా ఆశ్చర్యపోయింది. ప్రస్తుతం అయితే తాను ఎలాంటి రిలేషన్ లో లేనని.. ప్రేమ కోసం ఎదురుచూస్తున్నట్లు జహీర్  తెలిపాడు.