టాలీవుడ్ లో ఎక్కువగా పరభాషా హీరోయిన్లదే హవా. అందులోనూ నార్త్ బ్యూటీలంటే టాలీవుడ్ కి మోజెక్కువ. అందుకే నార్త్ హీరోయిన్లు టాలీవుడ్ లో స్టార్స్ గా ఎదుగుతుంటారు. ఇక స్పెషల్ సాంగ్ లో మెరవాలంటే నార్త్ లో నాజూకైన భామని రంగంలోకి దించాల్సిందే. 

2013లో సింగ్ సాబ్ ది గ్రేట్ చిత్రంతో నటిగా మారింది ఊర్వశి రౌతేల. కెరీర్ ఆరంభం నుంచి తన అందాలతో వెండితెరని ఈ భూలోక ఊర్వశి వేడెక్కిస్తోంది. ఇక 2018లో విడుదలైన హేట్ స్టోరీ 4లో అయితే ఊర్వశి రౌతేలా ఒక రేంజ్ లో రెచ్చిపో శృంగార తారగా ముద్ర వేయించుకుంది. 

ఇటీవల ఊర్వశి రౌతేలా సోషల్ మీడియాలో బికినీ ఫోజులు, టాప్ లెస్ బోల్డ్ ఫోజులతో రచ్చ చేస్తోంది. ఈమె బోల్డ్ షోకి సౌత్ లో కూడా ప్రతిఫలం లభిస్తోంది. ఇప్పటికే ఊర్వశి రౌతేల.. గోపీచంద్ సీటిమార్ చిత్రంలో కీలక పాత్రలో అవకాశం దక్కించుకుంది. తెలుగులో ఊర్వశి రౌతేలకు ఇదే డెబ్యూ మూవీ. 

ఇన్నాళ్లూ బయటకు రాని శ్రియ సెక్సీ ఫొటోలు

ఇక తాజాగా ఊర్వశి మరో క్రేజీ ఆఫర్ దక్కించుకున్నట్లు తెలుస్తోంది. సుకుమార్, స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కాంబోలో తెరకెక్కుతున్న పుష్ప చిత్రంలో ఓ స్పెషల్ సాంగ్ ఉంది. సుకుమార్ సినిమా అంటే స్పెషల్ సాంగ్ తప్పనిసరిగా ఉండాల్సిందే. ఈ చిత్రంలో ఐటెం సాంగ్ కోసం సుకుమార్ ఊర్వశి రౌతేలని ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. ఇదే కనుక నిజమైతే బన్నీ మాస్ స్టెప్పులని, ఊర్వశి ఘాటు అందాలని అభిమానులు ఎంజాయ్ చేస్తారు.