Asianet News TeluguAsianet News Telugu

ఓటీటీలోకి ‘డబ్ల్యూ.డబ్ల్యూ.డబ్ల్యూ ’

అదిత్‌ అరుణ్, శివాని రాజశేఖర్‌ హీరో హీరోయిన్లుగా నటిస్తున్న చిత్రం డబ్ల్యు డబ్ల్యు డబ్ల్యు'(ఎవ‌రు, ఎక్క‌డ‌, ఎందుకు). ఈ చిత్రానికి ప్ర‌ముఖ‌ సినిమాటోగ్రాఫ‌ర్ కేవి గుహన్ ద‌ర్శ‌కత్వం వ‌హిస్తున్నారు.  రామంత్ర క్రియేష‌న్స్ పతాకంపై ప్రొడ‌క్ష‌న్ నెం.1గా డా. రవి ప్రసాద్ రాజు దాట్ల నిర్మిస్తున్నారు. ఈ చిత్రం ప్రముఖ ఓటీటీ ‘సోనిలివ్’ వేదికగా విడుద‌ల కానున్న‌ది.
 

www movie direct release in sony liv
Author
Hyderabad, First Published Dec 5, 2021, 1:05 PM IST

‘118’ స‌క్సెస్ త‌రువాత..   ప్ర‌ముఖ‌ దర్శకుడు కె.వి. గుహన్‌ డైరెక్షన్‌లో రూపొందుతోన్న లేటెస్ట్ మిస్ట‌రీ థ్రిల్ల‌ర్ డబ్ల్యూ.డబ్ల్యూ.డబ్ల్యూ (ఎవరు, ఎక్కడ, ఎందుకు). ఈ చిత్రంలో అదిత్‌ అరుణ్‌, శివాని  రాజశేఖర్‌ హీరో హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని రామంత్ర క్రియేష‌న్స్ పతాకంపై ప్రొడ‌క్ష‌న్ నెం.1 గా డా. రవి ప్రసాద్ రాజు దాదాట్ల నిర్మిస్తున్నారు. వీరితోప్ర‌ముఖ నిర్మాణ సంస్థ సురేష్ ప్రొడ‌క్ష‌న్స్ భాగ‌స్వామ్య ఒప్పందం కుదుర్చుకుంది. ఫస్ట్‌ టైమ్ కంప్యూటర్‌ స్క్రీన్ బేస్డ్ మూవీగా రూపొందిన ఈ చిత్రం నుంచి ఇప్ప‌టికే విడుద‌లైన టీజ‌ర్, ఆదిత్య మ్యూజిక్ ద్వారా విడుదలైన అన్ని పాట‌లు విశేష ఆదరణ దక్కించుకున్నాయి. ఈ చిత్రానికి సైమన్‌ కె.కింగ్‌ స్వరాలందించారు. ఇప్పటికే అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా, త్వరలో విడుద‌ల కావ‌డానికి సిద్ధంగా ఉంది. 

అయితే ఈ చిత్రాన్ని థియేట‌రిక‌ల్ రిలీజ్ చేయ‌కుండా ఓటీటీలో విడుద‌ల చేయాల‌ని భావిస్తున్నారు మూవీ మేక‌ర్స్. ఈ మేర‌కు ‘డబ్ల్యూ.డబ్ల్యూ.డబ్ల్యూ. డిజిట‌ల్ రైట్స్‌ని  ప్రముఖ ఓటీటీ వేదిక ‘సోనిలివ్’ సంస్థ  ద‌క్కించుకుంది. అతి త్వ‌ర‌లో ఈ చిత్రం సోనిలివ్‌లో ప్ర‌సారం కానుంది.  నిజానికి ఈ సినిమా ఇప్పటికే విడుల కావాల్సి ఉండగా కరోనా కారణంగా వాయిదా పడింది. ఈ చిత్రం నుంచి విడుదలైన టీజర్‌, ఫస్ట్‌లుక్‌లు సినిమాపై అంచనాలు పెంచేశాయి. శివాత్మిక తొలి రెండు చిత్రాలు వినూత్న కథాంశంతో తెరకెక్కుతుండడం విశేషం.

Read Also: https://telugu.asianetnews.com/entertainment/nagarjuna-bangarraju-to-release-on-jan-15--r3d8de

ఈ సంద‌ర్భంగా చిత్ర నిర్మాత డా. రవి ప్రసాద్ రాజు దాట్ల మాట్లాడుతూ..   ఈ మూవీకి సురేష్ ప్రొడ‌క్ష‌న్స్ స‌హా నిర్మాతలుగా వ్యవ‌హరించ‌డం చాలా సంతోషంగా ఉంది. తెలుగులో తొలిసారి కంప్యూటర్‌ స్క్రీన్ బేస్డ్ గా ఈ మూవీ రానున్న‌ది. ఈ మూవీని థీయేట‌ర్ల‌లో విడుద‌ల చేయ‌డం కంటే..  ఓటీటీలో విడుద‌ల చేయ‌డ‌మే  ప‌ర్‌ఫెక్ట్ ఛాయిస్ అనిపించింది. ఈ సినిమాను  సోని వంటి ఇంట‌ర్నేష‌న‌ల్ సంస్థ‌తో అసోసియేట్ అవ‌డం మ‌రింత సంతోషంగా ఉంద‌ని తెలిపారు.గుహ‌న్‌గారి మేకింగ్, అదిత్‌ అరుణ్, శివాని రాజశేఖర్ కెమిస్ట్రి అన్ని వ‌ర్గాల‌ వారిని ఆక‌ట్టుకుంటుందని అన్నారు. ఈ సినిమాకి కూర్పు: తమ్మిరాజు, మాటలు: మిర్చి కిరణ్‌. సమర్పణ: సురేష్‌ ప్రొడక్షన్స్‌.

Read Also: https://telugu.asianetnews.com/gossips/srikanth-character-not-work-in-akhanda--r3knil

సాంకేతిక ప‌రిజ్ఞానం అభివృద్ది చెందుతున్న కొద్ది టెక్నాలజీ అర‌చేతులోకి వ‌చ్చేసింది. ఏ పని కావాలన్నా స్మార్ట్‌గా చేస్తోన్న రోజులివీ. మరో వైపు టెక్నాల‌జీ పెరుగుతున్న కొద్ది వాటికి అవ‌రోధకాలుగా సైబర్‌ నేరస్థులు మారుతున్నారు. ఈ క్ర‌మంలో మ‌న వ్య‌క్తిగ‌త స‌మాచారాన్ని హ్యాకింగ్ చేస్తున్నారు. మ‌న మ‌నుగ‌డ‌ను ప్ర‌శ్నార్థ‌కంగా మార్చేస్తున్నారు. ఇలాంటి క‌థాంశంలో తెర‌కెక్కుతున్న‌ చిత్రమే డబ్ల్యూ.డబ్ల్యూ.డబ్ల్యూ (ఎవరు, ఎక్కడ, ఎందుకు). ఓ నలుగురు ఫ్రెండ్స్ సరదాగా వీడియో కాల్‌ మాట్లాడుతుంటారు. ఈ సమయంలోనే వారికి ఆ కాల్స్‌ను సైబ‌ర్ నేర‌గాళ్లు  హ్యాక్‌ చేస్తారు. ఇక అక్కడి నుంచి ఆ నలుగురు వ్యక్తులకు కష్టాలు మొదలవుతాయి. అసలు ఆ హ్యాకింగ్‌ చేసింది ఎవరు, ఎక్కడి నుంచి చేశారు.. ఎందుకు చేశారనే ఆసక్తికరమైన కథాంశంతో ఈ సినిమా తెరకెక్కినట్లు అర్థమవుతోంది.

Follow Us:
Download App:
  • android
  • ios