శ్రీకాంత్‌కు అన్యాయం చేసిన బోయపాటి?
గతంలో బోయపాటి - బాలయ్య కాంబినేషన్లో విలన్ గా పరిచయమైన జగపతిబాబు, స్టార్ విలన్ గా కొనసాగుతున్నాడు. అలాగే శ్రీకాంత్ కూడా ఇక విలన్ పాత్రల్లో దూసుకుపోవడం ఖాయమనే రిలీజ్ ముందుదాకా అనుకున్నారు. కానీ ఇప్పుడు పెద్దగా శ్రీకాంత్ గురించి ఎవరూ మాట్లాడటం లేదు.
బాలకృష్ణ హీరోగా బోయపాటి తెరకెక్కించిన 'అఖండ' మొన్న గురువారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. తెలుగు రాష్ట్రాలతో పాటు ఓవర్సీస్ లోను ఈ సినిమా భారీస్థాయిలో ప్రేక్షకుల ఆకట్టుకుంటోంది. విడుదలైన ప్రతి ప్రాంతంలోను తొలి ఆటతోనే ఈ సినిమా హిట్ టాక్ తెచ్చుకుంది. ఎక్కడ చూసినా బాలయ్య అభిమానుల సందడి కనిపిస్తోంది. ఈ సినిమాపై బాలయ్య,బోయపాటితో పాటు మరొకరు కూడా ఎక్సపెక్టేషన్స్ పెట్టుకున్నారు. అతనే శ్రీకాంత్.
ఓ ప్రక్కన రైతుగాను .. అఘోరాగాను బాలకృష్ణ అదరగొట్టేశారు. అఘోరా పాత్రకు అయితే ఓ రేంజిలో రెస్పాన్స్ వస్తోంది. ఇక విలన్ గా నటించిన శ్రీకాంత్ కు మాత్రం చెప్పుకోదగిన పేరు రాలేదు. ఫ్యామిలీ హీరోగా సుదీర్ఘకాలం పాటు కొనసాగిన శ్రీకాంత్, విలన్ గా ఎలా మెప్పిస్తాడా అని అంతా అనుకున్నారు. కానీ తెరపై శ్రీకాంత్ కాకుండా ఆయన పోషించిన వరదరాజులు పాత్ర మాత్రమే కనిపించింది. అయినా అంత గొప్పగా ఆ పాత్రకి డైరక్టర్ న్యాయం చెయ్యలేదంటున్నారు. గతంలో బోయపాటి - బాలయ్య కాంబినేషన్లో విలన్ గా పరిచయమైన జగపతిబాబు, స్టార్ విలన్ గా కొనసాగుతున్నాడు. అలాగే శ్రీకాంత్ కూడా ఇక విలన్ పాత్రల్లో దూసుకుపోవడం ఖాయమనే రిలీజ్ ముందుదాకా అనుకున్నారు. కానీ ఇప్పుడు పెద్దగా శ్రీకాంత్ గురించి ఎవరూ మాట్లాడటం లేదు. అనుకున్న స్దాయిలో ఆఫర్స్ రావటం లేదని తెలుస్తోంది. అందుకు బోయపాటి కారణం అంటున్నారు సోషల్ మీడియా జనం.
శ్రీకాంత్ ఇంతకుముందే ‘యుద్ధం శరణం’లో మళ్లీ విలన్ పాత్ర చేసినా అది ప్రేక్షకులను ఆకట్టుకోలేదు. అలాగే‘అఖండ’లో శ్రీకాంత్ ఎంత బాగా చేసినప్పటికీ.. అతను చేసిన వరద రాజులు పాత్ర అయితే అనుకున్నంతగా పండలేదు. శ్రీకాంత్ పాత్ర ఇంట్రడక్షన్ చాలా భయంకరంగా ఉంది. కానీ ఆ తర్వాత ఆ ఇంట్రో కు తగ్గ సీన్స్ పడలేదు. బాలయ్యతో ఎదురుపడిన సీన్లో ఇద్దరూ పంచ్ డైలాగులు పేల్చుకున్నారే తప్ప అందులో చెప్పుకోదగ్గ విషయం లేదు.
Also read ఓవర్సీస్‌లో “అఖండ” కలెక్షన్స్ ఎలా ఉన్నాయంటే...
పోనీ ఆ తర్వాత సెకండాఫ్ లో అయినా శ్రీకాంత్ పాత్ర లేస్తుందేమో అనుకుంటే అదీ అతి సాధారణంగా సాగిపోతుంది. మెయిన్ విలన్‌గా వేరే వ్యక్తిని పెట్టడమే దెబ్బకొట్టింది అంటున్నారు. అంతేకాకుండా శ్రీకాంత్ క్యారక్టర్ ని చాలా సింపుల్‌గా ముగించేసారు. మొత్తంగా చూస్తే శ్రీకాంత్ క్యారెక్టర్ కు రావాల్సిన ఇంపాక్ట్ అయితే రాలేదు. బోయపాటి ..జగపతిబాబుకు ఇచ్చినట్లు సరైన క్యారక్టర్ గ్రాఫ్ ఇవ్వలేదు అంటున్నారు. ఈ విషయమై సినిమాతో సమానంగా సోషల్ మీడియాలో డిస్కషన్ జరుగుతోంది.
Also read ట్రాన్స్ జెండర్లని పెళ్లికి పిలిచిన మెగా కోడలు ఉపాసన.. సర్వత్రా ప్రశంసలు.. ఫోటోలు వైరల్