నందమూరి బాలకృష్ణ హీరోగా తెరకెక్కిన రిలీజ్ కు రెడీ అయిన చిత్రం `రూలర్‌`.  గతంలో బాలయ్య హీరోగా జైసింహా సినిమాకు దర్శకత్వం వహించిన కేయస్ రవికుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాను సీ కళ్యాణ్‌ నిర్మించారు. ఈ సినిమాకు అందుతున్న సమాచారం మేరకు 21 కోట్లు దాకా ప్రీ రిలీజ్  బిజినెస్ చేసారు. అంటే ఈ సినిమా హిట్ అయ్యి...22 కోట్లు షేర్ తెస్తేనే వర్కవుట్ అవుతుంది. అంత సత్తా ఈ సినిమాకు ఉందా అనేదే ఇప్పుడు ట్రేడ్ ముందున్న ప్రశ్న.

ఎన్టీఆర్‌ బయోపిక్‌గా తెరకెక్కిన కథానాయకుడు, మహానాయకుడు సినిమాలు డిజాస్టర్ కావటంతో బాలయ్య ఫ్యాన్స్ ఈ సినిమా మీదే ఆశలు పెట్టుకున్నారు. అయితే ఆ రెండు సినిమాల రిజల్ట్ ప్రభావం ఖచ్చితంగా ఓపినింగ్స్ పై ఉంటుంది. బాలయ్య సినిమా అంటే క్రేజ్ అనేది లేదు అనే స్దాయికు చేరుకుంది. ఈ సినిమా హిట్ టాక్ తెచ్చుకుంటే జనం వస్తారు. దానికి తోడు రేపటి రోజున ప్రతి రోజు పండగే, కార్తి దొంగ కూడా పోటీగా వస్తున్నాయి. ట్రైలర్స్ తో అవి తెచ్చుకున్న క్రేజ్ ని ఈ సినిమా తేలేకపోయింది. ఇది అన్ సీజన్.  ఎంతో గొప్పగా ఉంటే తప్ప జనం థియోటర్స్ వచ్చి చూడరు.

స్టేజ్ పైనే ఏడ్చేసిన హీరోయిన్!

ఇవన్నీ ప్రక్కన పెడితే ఈ సినిమా ఇన్ సైడ్ టాక్ చాలా పూర్ గా వినపడుతోంది. ఎన్నో సార్లు చూసిన బాలకృష్ణ సినిమాలా రొటీన్ ఏ మాత్రం కొత్తదనం లేకుండా సాగుతుందని,. యాక్షన్‌, పంచ్‌ డైలాగ్‌లు, హీరోయిన్లతో రొమాన్స్‌ లాంటి అంశాలు అన్నీ గతంలో బాలయ్య సినిమాల్లో చాలా సార్లు చూసినట్టుగానే ఉన్నాయన్న ప్రచారం జరుగుతోంది. అదే నిజమైతే రూలర్‌ బాలయ్య ఫ్యాన్స్‌కు మాత్రమే అనేది ఖాయం.

అయితే ఈ ఇన్ సైడ్ టాక్ అనేది ...ఎంతవరకూ నిజం అవుతుందనేది సందేహమే. ఇవన్నీ చాలవు అన్నట్లు... పోలీస్ గెటప్‌లో బాలయ్య విగ్‌పై సోషల్ మీడియాలో విపరీతమైన ట్రోలింగ్ నడుస్తోంది. సినిమాలో ఉన్న మరో  లుక్‌ కూడా ఐరన్‌ మ్యాన్‌లా ఉందంటున్నారు. ఈ ఇన్ సైట్ టాక్ తో కూడా రికవరీ ఏ స్దాయిలో ఉంటుందని అనుమానాలు రేపుతోంది.

ఇక బాలయ్య రెండు డిఫరెంట్‌ లుక్స్‌లో నటిస్తున్న ఈ సినిమాలో సోనాల్‌ చౌహాన్‌, వేదికలు హీరోయిన్లుగా నటిస్తుండగా జయసుథ, భూమిక, ప్రకాష్ రాజ్‌, శియాజీ షిండేలు ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఇటీవల సెన్సార్‌ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమాకు యూ/ఏ సర్టిఫికేట్‌ను జారీ చేశారు. డిసెంబర్‌ 20న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.