తెలుగులో 'లవ్లీ', 'రౌడీ', 'అడ్డా' వంటి చిత్రాల్లో నటించిన హీరోయిన్ శాన్వి సరైన హిట్టుని మాత్రం అందుకోలేకపోయింది. ఆ తరువాత తెలుగులో ఆమెకి అవకాశాలు రావడం తగ్గిపోయాయి. దీంతో చాలా రోజులుగా ఈ బ్యూటీ ఖాళీగా ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ క్రమంలో ఆమెకి కన్నడ నుండి ఓ ఛాన్స్ వచ్చింది.

ప్రముఖ నటుడు రక్షిత్ శెట్టి హీరోగా నటించిన 'అవనే శ్రీమన్నారాయణ'లో హీరోయిన్ గా నటించే ఛాన్స్ దక్కించుకుంది శాన్వి. ఇదే సినిమాని 'అతడే శ్రీమన్నారాయణ' అనే టైటిల్ తో తెలుగులో విడుదల చేస్తున్నారు. సచిన్ డైరెక్ట్ చేస్తోన్న ఈ సినిమాను తెలుగులో కూడా బాగానే ప్రమోట్ చేస్తున్నారు.

స్టార్‌ కమెడియన్‌ అలీ ఇంట్లో విషాదం

తాజాగా చిత్రబృందం ప్రీరిలీజ్ ఈవెంట్ ని ఏర్పాటు చేసింది. ఈ కార్యక్రమంలో హీరోయిన్ శాన్వి కంటతడి పెట్టుకుంది. తనది చిన్న వయసనో.. లేక సరిగ్గా నటించలేదనో.. అందంగా లేననో తెలియదు కానీ 'రౌడీ' సినిమా తరువాత తెలుగులో అవకాశాలు రాలేదని.. ఎన్నో రాత్రిళ్లు కుమిలిపోయనని, ఎక్కడ తప్పు జరిగిందో అర్ధం కాక ఏడ్చానని చెప్పుకొచ్చింది.

కానీ 'అతడే శ్రీమన్నారాయణ'తో మరోసారి తెలుగు ఆడియన్స్ ని పలకరించే ఛాన్స్ వచ్చిందని చెప్పింది. తెలుగులో అవకాశాలు రాకపోవడంతో తనలో కాన్ఫిడెన్స్ పోయిందని.. కనీసం ఈ సినిమాతోనైనా.. తెలుగు ప్రేక్షకులు తనలో టాలెంట్ ని గుర్తించి అవకాశాలు ఇస్తారని ఎదురుచూస్తున్నానని చెబుతూ కన్నీళ్లు పెట్టుకుంది.

సాధారణంగా హీరోయిన్లు అవకాశాలు రాకపోయినా.. ఇలా ఓపెన్ గా పైగా స్టేజ్ మీద అసలు ఇలాంటి కామెంట్స్ చేయరు. కానీ శాన్వి మాత్రం తనకు అవకాశాలు రావడం లేదని నిజాయితీగా మాట్లాడుతూ ఎమోషనల్ అయింది. ఈమె ఇచ్చిన స్పీచ్ కి అక్కడున్న వారంతా సపోర్ట్ చేశారు. ఇక ఈ సినిమా డిసెంబర్ 27న తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది.