అక్టోబర్ 23న ప్రభాస్ తన పుట్టినరోజు వేడుకలు జరుపుకోనున్నాడు. గడిచిన మూడేళ్లలో సినిమా సెట్స్ లోనే ప్రభాస్ పుట్టినరోజు జరిగింది. షూటింగ్ లేకపోతే గనుక ఇంట్లోనే తన పుట్టినరోజు సింపుల్ గా జరుపుకుంటాడు. అయితే ఈసారి మాత్రం ప్రభాస్ పుట్టినరోజుకి కొన్ని ప్రత్యేక పరిస్థితులున్నాయి. ఈ పుట్టినరోజుతో ప్రభాస్ 40 ఏళ్లు పూర్తి చేసుకోబోతున్నాడు. పైగా పుట్టినరోజుకు కొన్ని రోజుల ముందు లండన్ లో ఈవెంట్ కి వెళ్తున్నాడు.

ఈ నెల 19న రాయల్ ఆల్బర్ట్ హాల్ లో 'బాహుబలి' స్కోర్ లైవ్ కాన్సెర్ట్ ఉంది. సంగీత దర్శకుడు కీరవాణి ఆధ్వర్యంలో జరగనున్న ఈ లైవ్ షోకి రాజమౌళి, ప్రభాస్, రానా, అనుష్క కూడా వెళ్తున్నారు. షో జరిగిన నాలుగు రోజులకు ప్రభాస్ పుట్టినరోజు సెలబ్రేట్ చేసుకోబోతున్నాడు. కాబట్టి ఈవెంట్ అయిన తరువాత లండన్ లో మరో వారం రోజులు పాటు ఉండి తన పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకుంటాడంటున్నారు.

మరికొందరు మాత్రం పుట్టినరోజు టైమ్ కి ప్రభాస్ హైదరాబాద్ వచ్చేస్తాడని అంటున్నారు. అయితే ఈ ఎపిసోడ్ లో అనుష్క పేరు వినిపించడం హాట్ టాపిక్ గా మారింది. లండన్ లో ఈవెంట్ తరువాత అనుష్క కూడా ప్రభాస్ తోనే ఉంటుందా..? లేక తిరిగి వచ్చేస్తుందా..? అనేది ఆసక్తికరంగా మారింది. ప్రభాస్, అనుష్క ల రిలేషన్ కి సంబంధించి తరచూ వార్తలు వినిపిస్తూనే ఉన్నాయి.

ఇద్దరూ కలిసి సినిమాలు చేయడం, సన్నిహితంగా మెలగడంతో ఇద్దరు మధ్య ఏదో జరుగుతుందనే మాటలు వినిపిస్తున్నాయి. ఎప్పటికప్పుడు ఈ జంట ఆ రూమర్లను ఖండిస్తున్నా.. వార్తలు మాత్రం ఆగడం లేదు. ఈసారి ప్రభాస్ తో అనుష్క కూడా లండన్ లోనే ఉంటే గనుక ఇక ఈ పుకార్లకు ఫుల్ స్టాప్ పెట్టడం కష్టమే..  

వెండితెరపై కొత్త జోడి.. కెమిస్ట్రీ అదిరిపోయేనా..?