విజయ్ దేవరకొండ తన సినిమాల రిలీజ్ సమయంలో ఓ రేంజిలో రచ్చ చేస్తూంటారు. ఆ విషయం డియర్ కామ్రేడ్, నోటా, టాక్సీవాలా విషయంలో ప్రూవ్ అయ్యింది. అయితే ఈ రౌడీ హీరో  ఈ సారి మాత్రం మౌనం వహిస్తున్నారు. తన తాజా చిత్రం  ‘వరల్డ్‌ ఫేమస్‌ లవర్‌’ ఈ నెల 14 న రిలీజ్ కు రెడీ అవుతున్నా ఎక్కడా చడీ చప్పుడూ లేదు. ఆ సినిమా తనది కాదన్నట్లుగా ఎక్కుడా నోరు మెదపటం లేదు. ఇది కావాలని స్ట్రాటజీగా విజయ్ చేస్తున్నాడా లేక వేరే ఏమన్నా రీజన్ ఉందా అనేది ఇప్పుడు ఫిల్మ్ సర్కిల్స్ లో హాట్ టాపిక్ గా మారింది.

తను రెగ్యులర్ గా చేసే ఎక్సట్రీమ్ ప్రమోషన్స్ కు ఈ సినిమా దగ్గరకు వచ్చేసరికి ఎందుకు ఫుల్ స్టాప్ పెట్టాడనేది ఎవరికీ అంతు పట్టడం లేదు. దాంతో రకరకాల రూమర్స్ మీడియాలో ప్రచారం అవుతున్నాయి. ఈ సినిమా రిజల్ట్ తను ముందే ఊహించాడు అందుకే దూరం పెట్టాడని కొందరు దారుణంగా కామెంట్ చేస్తున్నారు. మరికొందరైతే నిర్మాతతో వచ్చిన పొరపొచ్చాలే అందుకు కారణం అని తేల్చి చెప్పేస్తున్నారు.

బోల్డ్, సెక్స్ సీన్లు.. కావాలనే చేశానంటున్న రాశిఖన్నా!

అబ్బే అలాంటిదేం లేదు..కేవలం హైప్ క్రియేట్ చేసి దాన్ని అందుకోపోతే వచ్చే సమస్యలను దృష్టిలో పెట్టుకునే ఇలా విజయ్ బిహేవ్ చేస్తున్నాడంటున్నారు. ఏదైమైనా విజయ్ దేవరకొండ తన సినిమాకు ఎప్పటిలాగే మంచి ఓపినింగ్స్ రావాలంటే ఖచ్చితంగా మౌనం వీడి...మీడియాలో హంగామా చెయ్యాలి.

మరో ప్రక్క ఈ సినిమా నిమిత్తం విడుదలైన ప్రమోషన్ మెటీరియల్ సైతం అప్ టు ది మార్క్ లేదు. దాంతో ఏ విధమైన బజ్ క్రియేట్ చేయలేకపోయింది.   రిలీజ్ చూస్తే మరో రెండు వారాలే ఉంది. అయితే ఇప్పటిదాకా ఈ ప్రాజెక్టుకు కొద్దిగా కూడా క్రేజ్ రాలేదు. సాధారణంగా విజయ్ సినిమాలు రిలీజ్ కు ముందు ఓ రేంజి బజ్ తో ఓపినింగ్స్ కు సిద్దం గా ఉంటాయి. అలాంటి పరిస్దితి ఈ సారి మచ్చుకైనా కనపడటం లేదు.  

క్రాంతిమాధవ్‌ దర్శకత్వంలో విజయ్‌ దేవరకొండ హీరోగా తెరకెక్కుతున్న చిత్రం ‘వరల్డ్‌ ఫేమస్‌ లవర్‌’. రాశీఖన్నా, ఐశ్వర్యా రాజేశ్, ఇజబెల్లా, కేథరిన్‌ హీరోయిన్లుగా నటిస్తున్నారు.  నలుగురు హీరోయిన్ల చుట్టూ తిరగే కథ కాబట్టి దీనికి ఈ టైటిల్ పెట్టారని తెలుస్తోంది. డియర్ కామ్రేడ్ ఫ్లాప్ కావడంతో ఈ చిత్రం విజయ్ కెరీర్‌కు కీలకంగా మారింది. మళ్ళీ మళ్లీ ఇది రానిరోజు సినిమా తర్వాత సరైన సక్సస్  లేని క్రాంతి మాధవ్.. ఈ సినిమాతో ఫామ్‌లోకి రావాలని చూస్తున్నాడు.

కేయస్‌ రామారావు సమర్పణలో కేయస్‌ వల్లభ నిర్మిస్తున్న ఈ చిత్రం  ప్రేమికుల రోజున (ఫిబ్రవరి 14) రిలీజ్‌ చేస్తున్నారు. ఇందులో విజయ్‌ దేవరకొండ విభిన్నమైన లుక్స్‌తో కనిపించనున్నారు. ఈ చిత్రానికి సంగీతం: గోపీసుందర్‌.