ఎప్పుడూలేని విధంగా 'వరల్డ్ ఫేమస్ లవర్' సినిమాలో బోల్డ్, సెక్స్ సీన్లలో రెచ్చిపోయి నటించింది నటి రాశిఖన్నా. విజయ్ దేవరకొండ హీరోగా నటించిన ఈ సినిమా ట్రైలర్ ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ ట్రైలర్ చూసిన వారంతా ఒక్కసారిగా షాకయ్యారు.

ఇందులో రాశి లిప్ లాక్ సీన్స్ లో నటించడంతో పాటు సెమీ న్యూడ్ గా కనిపించింది. అంతేకాదు.. ఓ షాట్ లో సెక్స్ సీన్ లో కూడా నటిస్తూ కనిపించింది. దీంతో ఆమె ఫ్యాన్స్ సోషల్ మీడియాలో పలు రకాల అభిప్రాయాలు వ్యక్తం చేశారు. కొంతమంది నెటిజన్లు ట్విట్టర్ లో ఆమెని ట్రోల్ చేశారు కూడా. అయితే రాశి మాత్రం ఇవేవీ పట్టించుకోలేదు.

నాగార్జున ఆస్తి విలువ.. ఆయన వాడే లగ్జరీ కార్లు ఇవే..!

ఈ మధ్యకాలంలో అమ్మడు హాట్ ఫోటోషూట్ లలో పాల్గొంటూ వాటిని తన ఇన్స్టాగ్రామ్ లో షేర్ చేస్తోంది. ఈ హాట్ లుక్స్ ని యాక్సెప్ట్ చేస్తోన్న నెటిజన్లు.. 'వరల్డ్ ఫేమస్' లవర్' సినిమాలో ఆమె నటించిన సెక్స్ సీన్ ని మాత్రం యాక్సెప్ట్ చేయలేకపోతున్నారు. అంత బోల్డ్ గా నటించాల్సిన అవసరం ఏమొచ్చిందంటూ కామెంట్స్ చేస్తున్నారు.

రాశికి కూడా తాజాగా ఈ సీన్లకు సంబంధించి ఓ ఇంటర్వ్యూలు ప్రశ్నలు ఎదురయ్యాయి. దీంతో ఆమె స్పందించక తప్పలేదు. సినిమాలో తను చేసిన కొన్ని సీన్లు మాత్రమే చూసి జడ్జ్ చేయడం కరెక్ట్ కాదని.. సినిమాకి అవసరమైన సన్నివేశాలను మాత్రమే చిత్రీకరించామని.. అవి కథలో భాగంగా ఉంటాయని.. జనాల అటెన్షన్ కోసం చేసిన సీన్లు కాదని అన్నారు. మరి సినిమాలో ఇంకెన్ని బోల్డ్ సీన్స్ లో కనిపించిందో చూడాలి!