ప్రపంచ వ్యాప్తంగా సంచలన విజయాన్ని నమోదు చేసిన  'బాహుబలి' సీరిస్ ఇప్పుడు వెబ్ సీరిస్ గా రాబోతున్న సంగతి తెలిసిందే. ది రైజ్‌ ఆఫ్‌ శివగామి’ అనే పుస్తకం ఆధారంగా రూపొందిస్తున్న బాహుబలి చిత్రం ‘ప్రీక్వెల్‌’ వెబ్ సీరీస్ లో ప్రధాన పాత్రని హిందీ నటి మృణాల్‌ ఠాకూర్‌  చేస్తున్నారు. హాలీవుడ్‌ను తలదన్నే గ్రాఫిక్స్ ‌తో  రాజమౌళి సృష్టించిన బాహుబలి ప్రపంచ వ్యాప్త ప్రేక్షకులను ఆకట్టుకుని కలెక్షన్లు, అవార్డుల వర్షం కురిపించింది.

అదే స్దాయిలో భారీ బడ్జెట్ తో ఈ వెబ్ సీరిస్ ని రెడీ చేస్తున్నారు. అయితే చాలా కాలం క్రితం ప్రారంభమైన ఈ వెబ్ సీరిస్ షూటింగ్, ఎడిటింగ్,విఎఫ్ ఎక్స్ పనులు పూర్తి చేసుకుంటోంది. దాంతో ఎప్పుడు ఈ వెబ్ సీరిస్ బయిటకు వస్తుందా అని ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు. అయితే ఈ వెబ్ సీరిస్ ని నిర్మిస్తున్న నెట్ ఫ్లిక్స్ వారు మాత్రం స్ట్రీమింగ్ ని కొంతకాలం ఆపుతున్నారట.

ప్రముఖ నటుడు కన్నుమూత!

అందుకు కారణం ..ఓ సారి రాజమౌళి ...ఈ వెబ్ సీరిస్ మొత్తం చూసి ఫైనల్ కట్ కు ఓకే చెప్పాలని భావిస్తున్నారట. ఈ మేరకు రాజమౌళిని సంప్రదిస్తే తాను సాయం చేస్తాను కానీ కొంత టైమ్ కావాలని చెప్పారట. తాను ప్రస్తుతం ఆర్ ఆర్ ఆర్ షూటింగ్ లో బిజిగా ఉన్నానని, తనకు దొరికే గ్యాప్ లో చూసి చెప్తానని అనటంతో నెట్ ఫ్లిక్స్ వారు కంగారు ఏముందని ఆపారట. రాజమోళి చూసి ఓకే చెప్తే ఆ క్రేజ్ వేరు. ఆ విషయం నెట్ ఫ్లిక్స్ కు బాగా తెలుసు. అలాగే ఈ వెబ్ సీరిస్ కు ఈవెంట్ చేసి ప్రబాస్ ని పిలుద్దామనే ఆలోచనలో కూడా ఉన్నారట. అంటే మొత్తానికి ఓ రేంజిలో క్రేజ్ తెచ్చి, అప్పుడు ట్రైలర్, టీజర్ వదిలి రిలీజ్ చేస్తారన్నమాట.

బాహుబలి సామ్రాజ్యం నిర్మాణం వెనకున్న కథాంశాన్ని వెబ్ సిరీస్ గా తీసుకొన్నారు. బాహుబలి లో ప్రధాన పాత్ర అయిన 'శివగామి' మాహిష్మతి సామ్రాజ్యాన్ని విస్తరించడంలో పోషించిన పాత్ర ఆధారంగా చేసుకొని ఈ వెబ్ సిరీస్ ని తీసుకొస్తున్నారు.

దర్శకులు దేవకట్టా,ప్రవీణ్ సత్తారు ఈ వెబ్ సిరీస్ కు దర్శకుడిగా వ్యవహరించనున్నారు. దర్శకధీరుడు రాజమౌళి పర్యవేక్షణలో ఈ ప్రాజెక్టు కొనసాగుతుంది.'శివగామి' వెబ్ సిరీస్ ను 3 సీజన్లలో అందించనున్నారు. ఈ వెబ్ సిరీస్ ని దాదాపు రూ. 375కోట్లతో తీసుకురాన్నట్లు చెప్తున్నారు. నిజమే అయితే ఓ వెబ్ సిరీస్ కోసం ఇంతటి భారీ బడ్జెట్ ని ఖర్చు చేస్తుండటం ఆశ్చర్యపరిచే విషయమే.