ప్రముఖ నటుడు శ్రీరామ్ లాగూ పూనేలో ప్రైవేట్ హాస్పిటల్ లో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. ఆయన వయసు 92 సంవత్సరాలు. ఆయన భార్య దీపా లాగూ కూడా నటిగా సినిమాలో చేశారు.

వీరికి ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. హిందీ, మరాఠీ భాషల్లో 211 సినిమాల్లో శ్రీరామ్ లాగూ నటించారు. ఆహత్, పింజ్‌రా, మేరే సాథ్ చల్, సామ్నా, కితాబ్, కినారా వంటి చిత్రాల్లో ఆయన నటించారు.

పూణే యూనివర్సిటీ మెడికల్ కాలేజీలో ఆయన ఎంబీబీఎస్, ఎంఎస్ చదివారు. ఈఎన్‌టీ సర్జన్‌గా కూడా  శ్రీరామ్ లాగూ ప్రాక్టీస్ చేశారు. ఆయన మరణవార్త తెలుసుకున్న సినీ ప్రముఖులు నివాళులు అర్పిస్తున్నారు.