బాలీవుడ్ కుర్ర హీరో కార్తిక్ ఆర్యన్ కి చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు. ముఖ్యంగా అతడికి అమ్మాయిల్లో ఫాలోయింగ్ చాలా ఎక్కువ. సారా అలీ ఖాన్ లాంటి స్టార్ కిడ్స్ కూడా కార్తీక్ తో డేటింగ్ చేయాలనుందని పబ్లిక్ గా కామెంట్స్ చేశారు.

అయితే కార్తిక్ మాత్రం తనకు ఒకప్పుడు గర్ల్ ఫ్రెండ్ ఉండేదని.. తన టీనేజ్ లవ్ స్టోరీని గుర్తు చేసుకున్నాడు. తాజాగా ఓ టీవీ షోలో పాల్గొన్న కార్తిక్.. తనకు 16 సంవత్సరాల వయసున్నప్పుడు తన గర్ల్ ఫ్రెండ్ తో కలిసి స్కూల్ లో ఒకే బెంచ్ లో కూర్చునేవాళ్లమని.. ఇద్దరం హోంవర్క్, అసైన్మెంట్స్ షేర్ చేసుకునేవాళ్లమని గుర్తు చేసుకున్నాడు.

‘జాను’ బడ్జెట్ ఎంత..? ప్రమోషన్స్ పెద్దగా లేవెందుకని..?

డేటింగ్ లో భాగంగా గ్వాలీయర్ లోని చాలా ప్రాంతాలకు వెళ్లి సరదాగా గడిపేవాళ్లమని.. ఆ సమయంలో ఎవరైనా చూస్తారేమోనని చాలా భయపడేవాళ్లమని చెప్పాడు. ప్రేమికులరోజు నాడు తన గర్ల్ ఫ్రెండ్ తో కలిసి రెస్టారంట్ కి వెళ్లేవాడట కార్తిక్. ఆ సమయంలో ఎవరైనా తనను గుర్తుపట్టి మాట్లాడితే మాత్రం.. వెంటనే తన గర్ల్ ఫ్రెండ్ ని కజిన్ అని చెప్పేవాడిని అంటూ అప్పటి విషయాలను షేర్ చేసుకున్నాడు.

ప్రస్తుతం ఈ హీరో నటించిన 'లవ్ ఆజ్ కల్' సినిమా ఫిబ్రవరి 14న ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రస్తుతం సినిమా ప్రమోషనల్ కార్యక్రమాలు నిర్వహిస్తోంది.