Asianet News TeluguAsianet News Telugu

‘జాను’ బడ్జెట్ ఎంత..? ప్రమోషన్స్ పెద్దగా లేవెందుకని..?

బడ్జెట్ ని దృష్టిలో పెట్టుకుని దర్శకుడు సినిమాని సింగిల్ షెడ్యూల్ లో ఫినిష్ చేసినట్లు సమాచారం. ప్రీ రిలీజ్ బిజినెస్ సైతం అనుకున్న స్దాయిలో కాలేదంటున్నారు. అయితే రిలీజ్ అయ్యాక ఊపందుకుంటుందంటున్నారు. 

Sharwanand's Jaanu wraps in low budget?
Author
Hyderabad, First Published Feb 6, 2020, 3:43 PM IST

‘జాను’ ఈ చిత్రం రేపు (ఫిబ్రవరి 7)న రిలీజ్ అవుతోంది. అయితే అనుకున్న స్దాయిలో ఈ సినిమాకు బజ్ లేదు. వైజాగ్ లో చేసిన ప్రీ రిలీజ్ ఈవెంట్స్ తో కొద్దిగా పుంజుకుంది. దిల్ రాజు వంటి పెద్ద నిర్మాత చిత్రం అయినా ప్రమోషన్స్ లో స్పీడు లేదు. ఈ నేపధ్యంలో ఈ చిత్రానికి ఎంత బడ్జెట్ పెట్టి ఉంటారనేది ట్రేడ్ వర్గాల్లో చర్చగా మారింది. అందుతున్న సమాచారం మేరకు ఈ సినిమాని దిల్ రాజు లో బడ్జెట్ లోనే లాగేసినట్లు సమాచారం.

మొత్తం సినిమా కలిపి 10 కోట్లు లోపే అయ్యిందని అంటున్నారు. ఈ బడ్జెట్ లోనే హీరో,హీరోయిన్స్, టెక్నీషియన్స్ రెమ్యునేషన్స్, తమిళ రీమేక్ రైట్స్ కు ఖర్చు పెట్టిన మొత్తం ఉన్నాయని సమాచారం. బడ్జెట్ ని దృష్టిలో పెట్టుకుని దర్శకుడు సినిమాని సింగిల్ షెడ్యూల్ లో ఫినిష్ చేసినట్లు సమాచారం. ప్రీ రిలీజ్ బిజినెస్ సైతం అనుకున్న స్దాయిలో కాలేదంటున్నారు. అయితే రిలీజ్ అయ్యాక ఊపందుకుంటుందంటున్నారు.

‘జాను’: శర్వా కి అగ్ని పరీక్ష, సమంతపైనే కక్ష!

రేపు కనక మంచి టాక్ వస్తే కనక దిల్ రాజు పంట పండినట్లే...బడ్జెట్ కంట్రోలులో చేసారు కాబట్టి మంచి లాభాలు గ్యారెంటీ అంటున్నారు. టాక్ ని చూసి ప్రమోషన్స్ స్పీడు చేద్దామని దిల్ రాజు ఆలోచన అని తెలుస్తోంది. ఈ విషయమై శర్వానంద్ సైతం కాస్త కోపంగా ఉన్నారట. ఇంత తక్కువ ప్రమోషన్స్ ఏమిటని,ఖచ్చితంగా ఓపినింగ్స్ పై ఈ ప్రభావం పడుతుందని భావిస్తున్నట్లు చెప్పుకుంటున్నారు.

సమంత అక్కినేని, శర్వానంద్‌ జోడీగా నటించిన చిత్రం ‘జాను’. తమిళంలో సూపర్‌ డూపర్‌ హిట్టుగా నిలిచిన ప్రేమకథ చిత్రం ‘96’కు జాను రీమేక్‌ ఇది. తెలుగు నేటివిటీకి తగ్గట్టు కొద్దిపాటి మార్పులు చేర్పులతో ఈ సినిమాను తెరకెక్కించారు. అలాగే తమిళంలో డైరెక్ట్‌ చేసిన ప్రేమ్‌కుమారే ‘జాను’చిత్రానికి దర్శకత్వం వహించారు.  ఇప్పటికే విడుదలైన టీజర్‌, ట్రైలర్‌, పాటలకు ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్  వస్తోంది. ముఖ్యంగా చిత్ర  ట్రైలర్‌ యూట్యూబ్‌లో తెగ ట్రెండ్‌ అవుతోంది.

Follow Us:
Download App:
  • android
  • ios