కొన్ని సంఘటనలు చిత్రంగా ఉంటాయి. ముఖ్యంగా సినీ పరిశ్రమలో జరిగే విషయాలు ఆశ్చర్యాన్ని కలిగిస్తాయి. అలాంటివాటిలో జానపద చిత్రాలతో ఎంతో పేరు తెచ్చుకున్న కాంతారావుని...విలన్ వేషాలతో పాపులర్ అయిన స్టార్ రాజనాల పేరుతో  పిలవటం ఒకటి. అదెలా జరిగిందో ...ఆ వింతేమిటో ఓ సీనియర్ సినీ జర్నలిస్ట్ లు కథనం ద్వారా బయిటకు వచ్చిన విశేషాలు ఏమిటో చూద్దాం.

అవి ‘నిర్దోషి’ చిత్రం నిర్మాణ రోజులు. ఆ టైమ్ లో తమ నెక్ట్స్ సినిమాని అంతా కొత్తవాళ్లతో తీద్దామని  దర్శక,నిర్మాత హెఎం రెడ్డి గారు ప్రకటన ఇచ్చారు. అప్పటి సినిమా పత్రికల్లో వచ్చిన ప్రకటన చూసి చాలా మంది ఫొటోలు, డిటేల్స్ పంపారు. వారిని డైరక్ట్ గా ఇంటర్వూకు పిలవకుండానే ఫొటోలు చూసి ఇద్దరిని ఎంపిక చేసారు. వాళ్లలో ఒకరు కల్లయ్య.మంచి ఎక్సరసైజ్ బాడీతో ఉన్న ఆయన్ను హీరోగా ఫిక్స్ చేసి స్టోరీ డిస్కషన్స్ మొదలెట్టేసారు. అయితే అక్కడే చిన్న ప్లాబ్లం వచ్చి పడింది. అంతకు ముందే  నిర్దోషి చిత్రం ప్రొడక్షన్ లో ఉన్నపుడు లక్ష్మీకాంతారావు అనే ఆర్టిస్ట్ కు చిన్న వేషం ఇస్తూ...నిన్ను హీరోగా పెట్టి నెక్ట్స్ సినిమా చేస్తానని ఇస్తామని ప్రామిస్ చేశారు హెచ్‌యం రెడ్డి.

హీరోయిన్ గొంతెమ్మ కోరిక... తలపట్టుకున్న ప్రొడ్యూసర్!

దాంతో ఈ సినిమా ప్రారంభ సమయంలో ఆ కుర్రాడు వచ్చి రెడ్డి గారిని కలిసి ‘అయ్యా...నా విషయం ఏం చేశారు’ అని అడిగారు. చేసేదేముంది..మాట మర్చిపోయినా...ఇచ్చేసాను కాబట్టి మాట తప్పటం మా వంశంలోనే లేదంటూ ఆ కుర్రాడినే హీరోగా ఓకే చేసారు. ఆ కుర్రాడు ఫుల్ హ్యాపీ. అయితే మరి కల్లయ్య పరిస్దితి ఏమిటి...అతన్ని పిలిచి విషయం వివరించి..విలన్ గా చేయమని ఒప్పించాడు. అబ్బే కుదరదు హీరో ఇవ్వాల్సిందే అని పట్టుబట్టినా, హెచ్ ఎం రెడ్డిగారు మాట మీద..చివరకు విలన్ గా ఓకే చేసాడు. అయితే ఓ కండీషన్ అన్నాడు. అదేమిటంటే..నా పేరు సినిమా మొదట్లో ఉండాలని. అలా హీరోగా లక్ష్మీ కాంతారావు, విలన్ గా కల్లయ్య బుక్ అయ్యారు. ఆ సినిమా పేరు ప్రతిజ్ఞ (1953).

ఇక లక్ష్మీ కాంతారావు పేరుని కాంతారావుగా కట్ చేసి, కల్లయ్యను ఆయన ఇంటి పేరు రాజనాలతో నూ ఈ సినిమా టైటిల్స్ వేసారు. మాట ఇచ్చినట్లుగానే రాజనాల పేరు ముందు, తర్వాత కాంతారావు పేరు తెరపై పడింది. దాంతో చాలా మంది కావాలని, మరికొంత మంది తెలియక..కాంతారావుని ఎక్కడ కనిపించినా రాజనాల అనిపిలిచేవారట.  ‘ప్రతిజ్ఞ’ సినిమాలో హీరోగా చేసిన రాజనాల ఈయనే అనటం కాంతారావుకు కొంత బాధ కలిగించినా, ఆ తర్వాత సరే అసలంటూ గుర్తిస్తున్నారని ఆనందపడ్డారు. ఆ సినిమా మంచి విజయం సాధించింది.

(పర్చా శరత్‌కుమార్ గారు రాసిన 'శరత్కాలం' ఆధారంగా)