ఇండస్ట్రీలో దాదాపు ఏడేళ్ల నుండి నటిగా కొనసాగుతోంది ఓ బ్యూటీ. తన కెరీర్ లో మహా అయితే రెండు హిట్స్ తప్ప ఇంకేం లేవు. రీసెంట్ గా అయితే గత రెండేళ్లుగా ఒక్క హిట్టు కూడా లేదు. ఇలాంటి సమయంలో తాజాగా వచ్చిన ఓ సినిమా మోస్తరుగా ఆడడంతో సదరు హీరోయిన్ కాన్ఫిడెన్స్ పెరిగిపోయింది.

తన సినిమా పెద్ద హిట్ అని చెప్పుకుంటూ తిరుగుతుంది. సినిమా హిట్ అని చెప్పుకుంటే తప్పు లేదు కానీ నెక్స్ట్ సినిమాకి ఏకంగా కోటి రూపాయల రెమ్యునరేషన్ డిమాండ్ చేస్తోంది. దీంతో అందరూ షాక్ అవుతున్నారు. ఓ పెద్ద బ్యానర్ లో ఈ మధ్య బ్యాక్ టు బ్యాక్ సినిమాలు అనౌన్స్ చేస్తున్నారు. 

ఏదైనా RRR తరువాతే.. క్లారిటీ ఇచ్చిన ఎన్టీఆర్

అందులో ఓ సినిమా కోసం సదరు హీరోయిన్ ని సంప్రదించారు. గతంలో ఇదే బ్యానర్ పై సినిమా చేస్తే ఆమెకి ముప్పై లక్షలు ఇచ్చారు. కాబట్టి ఈసారి యాభై లక్షలు ఇవ్వాలని అనుకున్నారు. కానీ ఆమె ఏకంగా కోటి రూపాయలు డిమాండ్ చేయడంతో నిర్మాతలు షాక్ అవుతున్నారు.

ఆమె అంత మొత్తం అడగడంతో అక్కడ నుండి జారుకున్నారు. ప్రస్తుతం ఈ బ్యూటీ తన సినిమా సూపర్ హిట్ అని.. పైగా తన కోసం చాలా ఆఫర్లు వస్తాయనే భ్రమలో ఉంది. ఆమె నటించిన సినిమా ఏవరేజ్ గానే ఆడుతుందని, తన కెరీర్ కూడా అంత సాఫీగా సాగడం లేదనే విషయాన్ని ఆమె గ్రహించడం లేదు. ప్రస్తుతం ఆమె చేతిలో ఒక్క సినిమా మాత్రమే ఉంది.