2010 ఏరకంగా చూసిన అంతగా కలసి రావడం లేదు. ప్రపంచ వ్యాప్తంగా విజృంభిస్తున్న కరోనా మానవాళికి పెను శాపంగా మారింది. ఇక బుధ, గురు వరుస రెండు రోజుల్లో ఇద్దరు సినీ దిగ్గజాలని చిత్ర పరిశ్రమ కోల్పోయింది. దీనితో బాలీవుడ్ మొత్తం ఒక్కసారి ఉలిక్కిపాటుకు గురైంది. 

ఇర్ఫాన్ ఖాన్, రిషి కపూర్ మరణించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం కరోనా లాక్ డౌన్ కారణంగా ఈ ఇద్దరి నటుల స్నేహితులకు, సహచర నటులకు కడసారి చూపు కూడా దక్కలేదు. బాలీవుడ్ తీవ్ర విషాదంలో ఉన్న ఇలాంటి తరుణంలో మరో రూమర్ కలవరపాటుకు గురి చేస్తోంది. 

సినిమాలో శృంగార సన్నివేశం.. అదే దర్శకుడితో హీరోయిన్ వివాహం

క్రిష్, డర్టీ పిక్చర్ లాంటి ఎన్నో అద్భుతమైన చిత్రాల్లో నటించిన సీనియర్ నటుడు నజీరుద్దీన్ షా అనారోగ్యం కారణంగా ఆసుపత్రి పాలయ్యారు అంటూ రూమర్స్ వ్యాపించాయి. దీనితో అభిమానులు నజీరుద్దీన్ ఆరోగ్యంపై సోషల్ మీడియా వేదికగా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 

ఈ రూమర్స్ వైరల్ లా వ్యాప్తి చెందుతుండడంతో నజీరుద్దీన్ తనయుడు వివాన్ షా ట్విట్టర్ లో స్పందించారు. తన తండ్రి ఆరోగ్యం బాగా లేదని, ఆసుపత్రిలో చేరారు అంటూ వస్తున్న వార్తలు ఫేక్ అని తేల్చేశాడు. 

నాన్నగారు బావున్నారు. ఆయన ఆరోగ్యం గురించి వస్తున్న వార్తలు ఫేక్. ఎవరూ అలాంటి వార్తలని నమ్మకండి. ఇర్ఫాన్ భాయ్, రిషి కపూర్ గారి కోసం నాన్నగారు ప్రార్థనలు చేస్తున్నారు. వారిద్దరిని మిస్ అవుతున్నందుకు నాన్నగారు బాధపడుతున్నారు. సంతాపం తెలియజేస్తున్నారు అంటూ వివాన్ షా క్లారిటీ ఇచ్చాడు.