బిగ్ బాస్ షోతో చివరి దశలోకి వచ్చినప్పటి నుంచి ఎంతో ఉత్కంఠను రేపుతోంది. షోలో కంటెస్టెంట్స్ మధ్య పోటీ తీవ్రత కూడా పెరుగుతోంది. ఫైనల్ టాప్ 5కి చేరుకున్న శ్రీ ముఖి - వరుణ్ సందేశ్ - అలీ రెజా - బాబా మాస్టర్  - రాహుల్ ఎవరికీ వారు టాస్క్ లతో షోని ఆసక్తిగా నడిపిస్తున్నారు. ఇకపోతే గత వారం షో నుంచి ఎలిమినేట్ అయినా వరుణ్ సందేశ్ సతీమణి వితిక బిగ్ బాస్ షోకి సంబందించిన పలు విషయాలని తెలిపింది.

వితిక మాట్లాడుతూ.. హౌజ్ లో ఉండటం వల్ల సొంతంగా ఎలా బ్రతకాలో నేర్చుకున్నాం. గూగుల్ - మొబైల్ లేకపోయినా 90రోజుల పాటు కలిసి ఉన్నాం. నా భర్తకు కూడా ఆ విషయాలు బాగా అర్థమయ్యాయి. ఈ కాంపిటీషన్ లో చాలా మంచి విషయాల్ని నేర్చుకున్నా. తప్పకుండా మా ఆయనే బిగ్ బాస్ విన్నర్ గా నిలుస్తారు. 50 లక్షల ప్రైజ్ మనీ వస్తే ఫిక్సిడ్ డిపాజిట్ చేసుకుంటాం. సేవింగ్స్ లేకపోతే కష్టంగా ఉంటుంది.

డబ్బు లేకపోతే ఎలా చూస్తారో తెలిసింది' అని తెలిపారు.  ఇక వచ్చే నెల 3న జరగబోయే ఫైనల్ ల్లో శ్రీముఖి తో పాటు రాహుల్ - మా ఆయన వరుణ్ సందేశ్ నిలుస్తారని చెప్పిన వితిక ఒక తెలుగింటి ఆడపడుచుగా తప్పకుండా మా ఆయనే గెలుస్తారని వివరణ ఇచ్చారు. ఇక గత వారం శివ జ్యోతి ఊహించని విధంగా ఎలిమినేట్ అయిన సంగతి తెలిసిందే. ఆదివారం బిగ్ బాస్ స్పెషల్ గెస్ట్ తో అందరికి మంచి కిక్ ఇచ్చాడు.

Read also: Bigg Boss 3: ఫన్నీ టాస్క్ లో అలరించిన యాంకర్ సుమ!  

దీపావళి స్పెషల్ గా బిగ్ బాస్ హౌస్ లోకి యాంకర్ సుమని పంపించారు. ఆమె ఎంట్రీతో అవాక్కయిన హౌస్ మేట్స్ వెల్కం చెబుతూ ఆమెతో కలిసి అల్లరి చేశారు. ముందుగా హౌస్ మొత్తం ఓ రౌండ్ కొట్టేసింది సుమ. హౌస్ మేట్స్ తమ బెడ్ దగ్గర పెట్టుకున్న స్టఫ్ ని చెక్ చేసింది. శ్రీముఖి మేకప్ కిట్ పై ఓ లుక్కేసి ఆడియన్స్ కి చూపించింది.  అనంతరం హౌస్ మేట్స్ ముచ్చటించిన సుమ.. దీపావళి రోజు ఏం చేసేవారో చెప్పేది అంటూ బాబా భాస్కర్ ని అడిగింది. దీంతో తన చిన్నప్పటి సంగతులు చెప్పాడు బాబా.