బిగ్ బాస్ సీజన్ 3 చివరి దశకి చేరుకుంది. హౌస్ లో ఉన్న ఐదుగురు కంటెస్టెంట్స్ దీపావళి జరుపుకున్నారు. దీపావళి స్పెషల్ గా బిగ్ బాస్ హౌస్ లోకి యాంకర్ సుమని పంపించారు. ఆమె ఎంట్రీతో అవాక్కయిన హౌస్ మేట్స్ వెల్కం చెబుతూ ఆమెతో కలిసి అల్లరి చేశారు.

ముందుగా హౌస్ మొత్తం ఓ రౌండ్ కొట్టేసింది సుమ. హౌస్ మేట్స్ తమ బెడ్ దగ్గర పెట్టుకున్న స్టఫ్ ని చెక్ చేసింది. శ్రీముఖి మేకప్ కిట్ పై ఓ లుక్కేసి ఆడియన్స్ కి చూపించింది.  అనంతరం హౌస్ మేట్స్ ముచ్చటించిన సుమ.. దీపావళి రోజు ఏం చేసేవారో చెప్పేది అంటూ బాబా భాస్కర్ ని అడిగింది. దీంతో తన చిన్నప్పటి సంగతులు చెప్పాడు బాబా.

 

 

ఆ తరువాత సుమ కోసం మటన్ బిరియాని చేసి పెట్టాలని దానికి సంబంధించిన సామాగ్రిని పంపించారు బిగ్ బాస్. ఈ ప్రాసెస్ లో రాహుల్, వరుణ్ లు పాటలు పాడారు. వంట పూర్తయిన తరువాత హౌస్ మేట్స్ తో ఫన్నీ టాస్క్ ఆడించింది సుమ.

హౌస్ మేట్స్ ఒక్కొక్కరుగా హెడ్ ఫోన్స్ ధరించాలి. ఆ హెడ్ ఫోన్స్ లో బిగ్ బాస్ మ్యూజిక్ ప్లే అవుతూ ఉంటుంది. ఆ సమయంలో సుమ కొన్ని వ్యాఖ్యలను చదివి వినిపిస్తారు. ఆ వ్యాఖ్యలను హౌస్ మేట్స్ కరెక్ట్ గా చెప్పాలి. ఈ టాస్క్ లో గెలిచిన వారిని బెస్ట్ ఎంటర్టైనర్ గా అనౌన్స్ చేస్తారు. అలా గెలిచిన వారికి తమ ఫ్యాన్ నుండి ఫోన్ కాల్ మాట్లాడే ఛాన్స్ ఉంటుంది.

ఈ టాస్క్ లో వరుణ్ ని విజేతగా ప్రకటించింది సుమ. ఆ తరువాత బిరియాని తిని బాగుందని బాబా భాస్కర్ కి కాంప్లిమెంట్ ఇచ్చారు. ఇంట్లో తను నిద్రపోతే కుక్కలు మొరుగుతాయో లేదో టెస్ట్ చేసి అందరినీ నవ్వించింది సుమ. రేపటి ఎపిసోడ్ లో కూడా సుమ కనిపించనుంది.