నేచురల్ స్టార్ నాని నిర్మాతగా మారిన సంగతి తెలిసిందే. వాల్ పోస్టర్ నే బ్యానర్ స్థాపించి 'అ!' అనే చిత్రాన్ని నిర్మించారు. ఈ సినిమా కమర్షియల్ గా వర్కవుట్ కానప్పటికీ నేషనల్ అవార్డ్స్ దక్కించుకుంది. ఈ సినిమా స్ఫూర్తితో నాని మరో సినిమా తీయాలని ప్లాన్ చేస్తున్నాడు.

'ఫలక్ నుమా దాస్' సినిమాతో పాపులర్ అయిన కుర్ర హీరో విశ్వక్ సేన్ తో నాని ఓ సినిమా తీయబోతున్నట్లు చాలా రోజులుగా ప్రచారం జరుగుతోంది. తాజాగా ఈ ప్రాజెక్ట్ పై అఫీషియల్ అనౌన్స్మెంట్ వచ్చింది. క్రిస్మస్ సందర్భంగా నాని తన బ్యానర్ లో రాబోతున్న కొత్త సినిమా టైటిల్ పోస్టర్ ని అభిమానులతో పంచుకున్నారు.

సెక్స్ సీన్లలో నటించలేకపోయా.. నటి కామెంట్స్!

ఈ సినిమాకి 'హిట్' అనే టైటిల్ ని ఫిక్స్ చేశారు. ఇందులో విశ్వక్ సేన్ రుద్రరాజు అనే పాత్రలో కనిపించనున్నారు. ఈ సినిమాని తను మాత్రమే హ్యాండిల్ చేయగలడని నాని తన సోషల్ మీడియాలో ఓ పోస్ట్ పెట్టారు.

న్యూఇయర్ రోజుల ఈ సినిమాకి సంబంధించిన ఫస్ట్ గ్లిమ్ప్స్ ని అభిమానులతో పంచుకుంటానని నాని వెల్లడించారు. ఈ సినిమాలో విశ్వక్ సేన్ కి జంటగా.. 'చిలసౌ' ఫేం రుహానీ శర్మ నటించనుంది. టైటిల్ పోస్టర్ లో అయితే విశ్వక్ సేన్ చాలా రఫ్ గా కనిపిస్తున్నాడు. ఈ సినిమాతో మరోసారి తన విశ్వరూపాన్ని చూపిస్తాడేమో చూడాలి!