ఒకప్పటితో పోలిస్తే ప్రస్తుతం ఉన్న సమాజంలో ట్రాన్స్‌జెండర్లకు అన్ని రంగాల్లో అవకాశాలు లభిస్తున్నాయి. సినిమా ఇండస్ట్రీలో కూడా ఇలాంటి వారికి ఛాన్స్ లు దక్కుతున్నాయి. ఇవాంకా దాస్ అనే ట్రాన్స్‌జెండర్ కి కూడా బాలీవుడ్ లో కొరియోగ్రాఫర్ గా, నటిగా అవకాశాలు వస్తున్నాయి.

బాలీవుడ్ లో 'డాన్స్ దీవానే' అనే షో ద్వారా గుర్తింపు తెచ్చుకున్న ఇవాంకా దాస్ ఆ తరువాత కొన్ని చిత్రాలకు పని చేసే అవకాశం దక్కించుకుంది. తాజాగా ఈమెకి 'యే హై జస్ట్ మండి' అనే వెబ్ సిరీస్ లో నటించే ఛాన్స్ వచ్చింది. ఇదే తన తొలి డిజిటల్ డెబ్యూ.

మీ ఫేవరేట్ స్టార్స్.. వాళ్లకి వీరాభిమానులు!

స్టోరీ విన్నప్పుడు చాలా బాగా అనిపించిందని కానీ సెక్స్ సన్నివేశాల్లో నటించాల్సి ఉంటుందని తెలిసినప్పుడు చాలా అసౌకర్యానికి గురైనట్లు చెప్పింది. వ్యక్తిగత జీవితంలో బోల్డ్ గా ఉండొచ్చు కానీ తెరపై ఇలాంటి సన్నివేశాల్లో మాత్రం నటించలేనని చెప్పింది. కానీ నటిగా మారిన తరువాత ఇలాంటి సన్నివేశాల్లో నటించడానికి ఇబ్బంది పడకూడదని తెలుసుకున్నట్లు వెల్లడించింది.

ఈ వెబ్ సిరీస్.. సీమా అనే యువతి తన లైంగిక కోరికలు తీర్చుకోవడానికి ఏం చేస్తుందనే కాన్సెప్ట్ తో తెరకెక్కించినట్లు తెలుస్తోంది. ఇందులో ఇవాంకా.. కరీనా అనే వేశ్య పాత్రలో కనిపించనుంది. ఇలాంటి పాత్రలో నటించడానికి ఎవరినైనా స్పూర్తిగా తీసుకున్నారా..? అని ఇవాంకాని ప్రశ్నించగా.. తను ట్రాన్స్ విమెన్ అని కాబట్టి ఇతర నటీనటులను స్పూర్తిగా తీసుకోలేనని చెప్పింది. తనకు ఎవరినీ స్పూర్తిగా తీసుకోవడం నచ్చదని వెల్లడించింది.