విభిన్న కధా చిత్రం ‘అ’ సినిమాతో నిర్మాత‌గా మారిన  నాని ఇప్పుడు మరో సినిమా చేస్తున్నారు.  తాజాగా `హిట్‌`...`ది ఫ‌స్ట్ కేస్‌` ట్యాగ్ లైన్‌ గల సినిమాకు నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ‘ఫలక్‌నుమా దాస్’తో హిట్ అందుతున్న హీరో విశ్వక్‌సేన్ ఇందులో హీరోగా నటించారు. చిత్రంలో  ఓ మిస్సింగ్ కేసును ఎంక్వైరీ ఆఫీసర్  పాత్రలో విశ్వక్ సేన్ నటించారు. విశ్వ‌క్ సేన్ ఈ చిత్రంలో విక్ర‌మ్ రుద్ర‌రాజు అనే ఐపీఎస్ ఆఫీస‌ర్‌గా క‌నిపించ‌బోతున్నారు.

ఇక  ‘చిలసౌ’తో పరిచయం అయిన రుహానీ శర్మ ఇందులో హీరోయిన్ గా నటిస్తున్నారు.  రీసెంట్ విడుద‌లైన టీజ‌ర్‌కి మంచి రెస్పాన్స్ వ‌చ్చింది. అయితే టీజర్ రిలీజైన దగ్గర నుంచి అసలు టైటిల్  హిట్ అంటే ఏంట‌ని చాలా మంది అడుగుతున్నారు. మీ కోసం ఈ ఆన్స‌ర్ అంటూ వీడియో విడుద‌ల చేశారు మేక‌ర్స్‌. ఆ వీడియో మీరు ఇక్కడ చూడవచ్చు.

విశ్వక్ సేన్ 'హిట్' రిలీజ్ డేట్ ఫిక్స్!

ఈ వీడియోలో హీరో విశ్వక్ సేన్ తో హిట్ అర్థం చెప్పించారు. హిట్ అంటే.. “హోమిసైడ్ ఇంట‌ర్‌వెన్ష‌న్ టీం” అని చెబుతాడు. ఇదొక క్రైమ్ ఇన్వెస్టిగేష‌న్ డిపార్ట్‌మెంట్ అని తెలియ‌జేశాడు విశ్వ‌క్ సేన్‌. ఈ నెల 28న హిట్ ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఈ చిత్రానికి  కొలను శైలేష్ దర్శకత్వం వహిస్తున్నారు. వివేక్ సాగ‌ర్ సంగీతం.. మ‌ణికంద‌న్ సినిమాటోగ్ర‌ఫీ సినిమాకు ప్ర‌ధాన ఆక‌ర్ష‌ణ కానున్నాయి.