ఫలక్ నుమా దాస్ సినిమాతో హడావుడి చేస్తూ కనిపించిన యువ హీరో విశ్వక్ సేన్ ఆ సినిమాను సొంతంగా నిర్మించడమే కాకుండా తనే డైరెక్ట్ చేశాడు ఆ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద అనుకున్నంతగా సక్సెస్ కాలేకపోయింది. ఇక నెక్స్ట్ నాని ప్రొడక్షన్ లో తెరక్కెడుతున్న 'హిట్' అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఇప్పటికే  ఆ సినిమా షూటింగ్ పూర్తి కాగా పోస్ట్ ప్రొడక్షన్ పనులు ఎండింగ్ దశలో ఉన్నాయి.

ఇక సినిమా పనులన్నిటినీ మరికొన్ని రోజుల్లో పూర్తి చేసి ఫిబ్రవరి 28 సినిమాని రిలీజ్ చేయాలని అనుకుంటున్నారు. నాని వాల్ పోస్టర్ ప్రొడక్షన్ లో మొదట అ! అనే సినిమా చేసిన సంగతి తెలిసిందే.   నిర్మాతగా నాని క్లిక్కవ్వడంతో నెక్స్ట్ కూడా అదే తరహాలో ఒక డిఫరెంట్ సినిమా చేయాలనీ గత కొంత కాలంగా ప్రయత్నాలు చేస్తున్నాడు.  ఇక ఫలక్ నుమా దాస్ చూసిన నాని వెంటనే విశ్వక్ సేన్ తో కొత్త సినిమా చేయడానికి అగ్రిమెంట్ కుదుర్చుకున్నాడు. కథలో విశ్వక్ డిఫరెంట్ షేడ్స్ లలో కనిపించే అవకాశం ఉన్నట్లు ఫస్ట్ లుక్ తోనే చెప్పేశారు.

ఎవరు ఊహించని ట్విస్ట్ ల తో పాటు సినిమాలో నాని గెస్ట్ రోల్ కూడా ఉంటుందని ఫిల్మ్ నగర్ లో టాక్ వినిపిస్తోంది. సినిమాలో కథను మలుపు తిప్పే పాత్రలు ఆడియెన్స్ కి కిక్ ఇవ్వనున్నట్లు సమాచారం. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ లో ఉన్న ఆ సినిమా అక్టోబర్ లో లాంచ్ కానుంది.  ఇక సినిమా రెగ్యులర్ ప్రమోషన్స్ మొదలుపెట్టి ఫిబ్రవరి ఎండ్ లో హిట్ సినిమాని చేయాలనీ ప్లాన్ చేసుకున్నారు. అ! సినిమాతో తెలుగు రాష్ట్రాల్లో అనుకున్నంతగా లాభాలు అందుకొని నాని ఈ సినిమాతో అయినా బాక్స్ ఆఫీస్ వద్ద క్లిక్కవుతాడో లేదో చూడాలి.