తమిళ సినిమా ఇండస్ట్రీలో తనకంటూ గుర్తింపు తెచ్చుకున్నాడు నటుడు విష్ణు విశాల్. ఒకప్పుడు ఆయన సినిమాలకు మినిమం గ్యారంటీ ఉండేది. కానీ తన వ్యక్తిగత కారణాల వలన కెరీర్ బాగా దెబ్బతింది. ఈ విషయాల గురించి తాజాగా ఈ హీరో సోషల్ మీడియాలో ఎమోషనల్ పోస్ట్ పెట్టాడు.

ఇటీవల ఓ సినిమా సెట్ లో విష్ణుకి తీవ్ర గాయాలయ్యాయి. ఇప్పుడిప్పుడే గాయాల నుండి కోలుకుంటున్నాడు. ఈ క్రమంలో తాను ఎదుర్కొన్న ఒడిదుడుకుల గురించి సోషల్ మీడియాలో ఓ పోస్ట్ పెట్టాడు. డియర్ ఫ్రెండ్స్ ఈరోజు నా గురించి ఓ విషయం చెప్పాలనుకుంటున్నానని మొదలుపెట్టి.. తను కూడా జీవితంలో ఎన్నో సమస్యలను ఎదుర్కొన్నానని చెప్పాడు.

క్యూట్ గా ఉండే కలర్స్ స్వాతి.. ఇప్పుడేంటి ఇలా మారిపోయింది!

గత రెండున్నరేళ్లు జీవితంలో నరకం అనుభవించానని.. చీకటిలో బతికానని చెప్పారు. సినిమా కెరీర్ బాగానే సాగుతున్న సమయంలో తన వ్యక్తిగత జీవితం మాత్రం నాశనం అయిపోయిందని.. పదకొండేళ్లు కలిసి ఉన్న భార్య వదిలేసి వెళ్ళిపోయిందని.. అప్పటికి తన కొడుకుకి నెలలు కూడా నిండలేదని చెప్పాడు. భార్యతో పాటు బిడ్డకి కూడా దూరం కావల్సి రావడంతో కుంగిపోయాయని.. మద్యానికి బానిసగా మారానని చెప్పారు.

తాగుడు, ఒత్తిడి, నిద్రలేమితనం కారణాలతో తన ఆరోగ్యం దెబ్బతిందని.. సర్జరీ కూడా జరిగిందని చెప్పారు. అదే సమయంలో తన సొంత నిర్మాణ సంస్థకి నష్టాలు రావడంతో ఆర్థికంగా కూడా సమస్యలు ఎదురయ్యాయని చెప్పారు. 21 రోజుల్లో సినిమా తీసి, రిలీజ్ చేయాలనుకుంటే షూటింగ్ సమయంలో గాయం తగిలిందని.. దాని కారణంగా రెండు నెలలు బెడ్ మీదే ఉండాల్సి వచ్చిందని చెప్పారు.

'రాక్షసన్' లాంటి హిట్ సినిమా తీసినప్పటికీ.. ఎనిమిది ప్రాజెక్ట్ లను చేజార్చుకున్నట్లు చెప్పారు. భార్య వదిలేయడం, బిడ్డకి దూరం కావడం, ఆర్ధిక ఇబ్బందులు, మద్యం.. ఇవన్నీ తన జీవితాన్ని తలకిందులు చేశాయని.. తన కుటుంబాన్ని కూడా బాధపెట్టాయని.. దీంతో తన జీవితాన్ని కంట్రోల్ చేసుకోవాలనుకున్నానని చెప్పారు. ఇది ఇలా ఉండగా.. గత కొంతకాలంగా విష్ణు విశాల్.. బాడ్మింటన్ ప్లేయర్ గుత్తా జ్వాలాతో డేటింగ్ చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. 

 

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

I took the VAARNAM AAYIRAM way :)

A post shared by vishnu vishal (@iamvishnuuvishal) on Jan 16, 2020 at 3:02am PST