హీరో విశాల్ కు తెలుగు, తమిళ భాషల్లో మంచి ఫాలోయింగ్ ఉంది. పందెంకోడి చిత్రంతో విశాల్ అటు తెలుగులో, ఇటు తమిళంలో పాపులర్ అయ్యాడు. విశాల్ తాను మనసులో అనుకున్న విషయాన్ని దైర్యంగా చెబుతాడు. అందుకే తమిళ చిత్ర పరిశ్రమలో విశాల్ పేరు తరచుగా వినిపిస్తోంది. 

పలు వివాదాల్లో విశాల్ పేరు వినిపిస్తూ ఉంటుంది. ప్రస్తుతం విశాల్ నటిస్తున్న చిత్రం తుప్పరివాలన్ 2. గతంలో విశాల్ నటించిన  తుప్పరివాలన్ చిత్రానికి ఇది సీక్వెల్ గా తెరకెక్కుతోంది. తెలుగులో డిటెక్టివ్ గా విడుదలైంది. తాజాగా విశాల్ డిటెక్టివ్ లుక్ లో ఉన్న  తుప్పరివాలన్ 2 ఫస్ట్ లుక్ ని కూడా రిలీజ్ చేసారు. 

ఈ చిత్రానికి మొదట మిస్కిన్ ని దర్శకుడిగా అనుకున్నారు. తొలి భాగాన్ని తెరకెక్కించింది ఈ దర్శకుడే.  తుప్పరివాలన్ 2 చిత్రం ప్రారంభమైన కొన్ని రోజులకే ఈ దర్శకుడు తప్పుకున్నాడు. దీనిపై విశాల్ వివరణ ఇస్తూ మిస్కిన్ పై సంచలన ఆరోపణలు చేశాడు. 

ప్రకాష్ రాజ్ కు షాక్.. రూ.5 కోట్ల వ్యవహారంలో ఇరుక్కున్నాడు!

ఒక నిర్మాతగా, నటుడిగా.. చిత్ర నిర్మాణం గురించి నాకు అవగాహన ఉండదా ? నేను దర్శకుడికి సలహాలు, సూచనలు ఇవ్వడం తప్పా ? దర్శకుడు పొరపాట్లు చేస్తే ఎత్తి చూపడం తప్పా ? అని విశాల్ ప్రశ్నించాడు. కేవలం స్క్రిప్ట్ రెడీ చేయడం కోసమే కెనడా, యూకే లో 35 లక్షలు వృథాగా మిస్కిన్ ఖర్చు చేశాడు. 

సరైన ప్లానింగ్ లేకుండా సినిమా నిర్మాణం కోసం ఇప్పటి వరకు 13 కోట్లు వృధాగా ఖర్చయ్యాయి. షూటింగ్ లో రోజుకు 15 లక్షలు ఖర్చయ్యేది. కనీసం రోజుకు రెండు సన్నివేశాలైనా చిత్రీకరించాలని, అలాగైనా ఖర్చు తగ్గుతుందని దర్శకుడికి నేను చెప్పడం తప్పా అని విశాల్ ప్రశ్నించాడు. సినిమాని ఓ అనాథ బిడ్డలా వదిలేసే దర్శకుడు అవసరమా అని విశాల్ ప్రశ్నించాడు. ఇలాంటి కారణాల వల్లే మిస్కిన్ తప్పుకున్నాడు. నేను దర్శకత్వ బాధ్యతలు చేపట్టా అని విశాల్ అధికారికంగా ఓ ప్రెస్ నోట్ లో ప్రకటించాడు. దర్శకుడు మిస్కిన్ చివరగా సైకో అనే చిత్రాన్ని తెరకెక్కించారు.