కోలీవుడ్ స్టార్ హీరో విశాల్ ఈ మధ్య యాక్షన్ డోస్ పెంచినట్లు అర్ధమవుతోంది. కమర్షియల్ యాంగిల్ మిస్ కాకుండా ఆల్ రౌండర్ గా డిఫరెంట్ కథలను ఎంచుకుంటున్నాడు. నేడు యాక్షన్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విశాల్ అలాగే మరో స్పెషల్ పోస్టర్ ని రిలీజ్ చేశారు. త్వరలో చక్ర ఆ అనే సినిమాతో రాబోతున్నట్లు చెప్పేశాడు.  సినిమా పోస్టర్ చూస్తుంటే విశాల్ మరో యాక్షన్ అడ్వెంచర్ ని బిగ్ స్క్రీన్ పై ప్రజెంట్ చేయబోతున్నట్లు అర్ధమవుతోంది.

గతంలో ఎప్పుడు లేని విధంగా ఒక కొత్త తరహా ఆయుధాన్ని పట్టుకొని చక్ర టైటిల్ తో మ్యాజిక్ క్రియేట్ చేయబోతున్నట్లు తెలుస్తోంది. ఆనందన్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాకు యువ శంకర్ రాజా సంగీతం అందిస్తున్నాడు. త్వరలోనే సినిమాకు సంబందించిన మరో స్పెషల్ సర్ ప్రైజ్ ఇవ్వాలని ప్లాన్ చేసుకుంటున్నాడు.  విశాల్ ఇటీవల కాలంలో బాక్స్ ఆఫీస్ వద్ద సాలిడ్ హిట్స్ ఎక్కువగా అందుకుంటున్నాడు.

read also: నష్టాలతో దెబ్బకొట్టిన మన స్టార్ హీరోల సినిమాలు.. లాస్ ఎంత?

ఇకపోతే ఈ చక్ర సినిమా అభిమన్యుడి కథకు సీక్వెల్ అని కోలీవుడ్ మీడియాలో కథనాలు వెలువడుతున్నాయి. కానీ చిత్ర యూనిట్ ఇంకా ఆ విషయంపై క్లారిటీ ఇవ్వలేదు. యాక్షన్ సినిమా హిట్టయితే చక్ర సినిమాపై మరిన్ని అంచనాలు పెరుగుతాయని చెప్పవచ్చు. ఇక తెలుగులో కూడా త్వరలోనే విశాల్ డైరెక్ట్ తెలుగు సినిమా చేసేందుకు ఇష్టపడుతున్నట్లు తెలుస్తోంది.  గతంలో ఓ సారి తెలుగులోట్రై చేసినప్పటికీ పెద్దగా సక్సెస్ అందుకోని విశాల్ తెలుగు ఆడియెన్స్ కి మరింత దగ్గరవ్వాలని ప్రముఖ దర్శకులతో ఎప్పటికప్పుడు టచ్ లో ఉన్నట్లు సమాచారం.

అలాగే నానితో కూడా ఒక మల్టీస్టారర్ సినిమాలో నటించే అవకాశం ఉన్నట్లు రూమర్స్ వచ్చాయి. యాత్ర దర్శకుడు మహి వి రాఘవ కథను వినిపించగా విశాల్ ఒప్పుకున్నాడు. కానీ నాని అంతగా ఇంట్రెస్ట్ చూపలేదని కూడా టాక్ వచ్చింది. ప్రస్తుతం ఆ మల్టీస్టారర్ గురించి ఎలాంటి చర్చలు జరగడం లేదు. మరి విశాల్ ఎలాంటి తెలుగు సినిమా చేస్తాడో చూడాలి.