టాలీవుడ్ ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా అనిల్‌ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం 'సరిలేరు నీకెవ్వరు'. రష్మిక మందణ్న హీరోయిన్ గా... చేస్తున్న ఈ సినిమాలో  ఆర్మీ అధికారి మేజర్‌ అజయ్‌ కృష్ణగా కనిపించనున్నాడు‌. ఇప్పటికే అనిల్ రావిపూడి ఇప్పటికే నాలుగు వరుస హిట్లతో తిరుగులేని ఫామ్‌లో ఉండటంతో సినిమాపై మంచి క్రేజ్ ఏర్పడింది.

ఇప్పటికే ఈ సినిమా ఫస్ట్ లుక్ టీజర్ మరియు పోస్టర్స్ రిలీజ్ అయి అడియెన్స్ నుంచి ఓ రేంజిలో రెస్పాన్స్ వస్తోంది. దాంతో ఈ సినిమా ప్రి రిలీజ్ బిజినెస్ కూడా అదిరిపోయే రేంజ్‌లో జరుగుతోంది. ఈ సినిమా రైట్స్ కోసం బయ్యర్లు పోటాపోటీగా ముందుకు వస్తున్నారు. అలాంటి సినిమా గుంటూరు రైట్స్ ని మెహర్ రమేష్ తీసుకోవటంతో ఇండస్ట్రీ ఆశ్చర్యపోయింది.

శ్రద్దా దాస్ ఇలా కనిపిస్తే కుర్రాళ్ళ హృదయాల్లో అలజడే.. హాట్ ఫోజులు అదుర్స్!

అయితే ఈ రైట్స్ ని నమ్రత దగ్గరుండి ఇప్పించిందని సమాచారం. తమ కుటుంబానికి సన్నిహితంగా ఉంటున్న మెహర్ రమేష్ కు సాయిం చేయటానికి ఆ రైట్స్ ఇప్పించిందని వినికిడి. ఆ రైట్స్ తో ఇప్పుడు మెహర్ రమేష్ జాక్ పాట్ కొడుతున్నాడని అంటున్నారు. థియోటర్ అడ్వాన్స్ ల రూపంలోనే ఆయన పెట్టుబడి వచ్చేసిందని, మిగతాదంతా లాభమే అంటున్నారు.
 
మరో ప్రక్క సరిలేరు ఓవర్సీస్ హక్కులు గ్రేట్ ఇండియా ఫిలింస్ వారు కొద్దిరోజుల క్రితం భారీ ధరకు దక్కించుకున్నారు. ఇక ఏపీ, తెలంగాణతో పాటు కర్నాటక, తమిళనాడు లాంటి చోట్ల రైట్స్ కోసం బయ్యర్లు పోటాపోటీగా ముందుకు వస్తున్నారు. రేట్లు కూడా భారీ గా చెప్తున్నారు.

నైజాం రైట్స్‌ను ఇండస్ట్రీకే చెందిన ఓ బడా నిర్మాత భారీ రేటు ఇచ్చి మరీ సొంతం చేసుకునేందుకు రెడీగా ఉన్నాడని ఇంకా ఫైనలైజ్ కాలేదని టాక్.   సంక్రాంతి కానుకగా జనవరి 12న ఈ సినిమా రిలీజ్ కానున్న సంగతి తెలిసిందే.

సీనియర్ హీరోయిన్ విజయశాంతి ఓ కీలక పాత్ర పోషిస్తున్న ఈ చిత్రానికి... దేవిశ్రీ ప్రసాద్‌ స్వరాలు సమకూరుస్తున్నాడు. ఏకే ఎంటర్‌టైన్‌మెంట్‌, శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌, జి.మహేశ్‌బాబు ఎంటర్‌టైన్‌మెంట్‌ పతాకంపై... రామబ్రహ్మం సుంకర, దిల్‌రాజు, మహేశ్‌బాబులు నిర్మిస్తున్నారు. సంక్రాంతి కానుకగా వచ్చే ఏడాది జనవరి 12న విడుదలకానుంది.