Asianet News TeluguAsianet News Telugu

20 ఏళ్ల నాటి కల.. ఇప్పుడు సాకారమైంది : విజయశాంతి

సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుతో ఇరవై ఏళ్ల క్రితం తను 'భారతరత్న' సినిమాలో ఆర్మీ ఆఫీసర్ గా కన్న కల ఇప్పుడు సాకారమైందని ఆమె అన్నారు. భారత సైన్యంలో పని చేస్తున్న మహిళా అధికారులకు కూడా శాశ్వత కమిషన్, కమాండింగ్ రోల్స్ ఇవ్వాల్సిందేనని.. దానిపై ఉన్న నిషేధం ఎత్తివేయాలని సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుని స్వాగతిస్తూ విజయశాంతి ఫేస్ బుక్ ద్వారా స్పందించారు. 

vijayashanthi welcomes supreme court verdict
Author
Hyderabad, First Published Feb 19, 2020, 12:54 PM IST

రెండు దశాబ్దాల క్రితం తను పోషించిన ఆర్మీ ఆఫీసర్ పాత్రను వాస్తవ రూపంలోకి తెచ్చేవిధంగా సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు మహిళా సాధికారతకు స్పూర్తినిచ్చే విధంగా ఉందని అన్నారు లేడీ సూపర్ స్టార్ విజయశాంతి. సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుతో ఇరవై ఏళ్ల క్రితం తను 'భారతరత్న' సినిమాలో ఆర్మీ ఆఫీసర్ గా కన్న కల ఇప్పుడు సాకారమైందని ఆమె అన్నారు.

భారత సైన్యంలో పని చేస్తున్న మహిళా అధికారులకు కూడా శాశ్వత కమిషన్, కమాండింగ్ రోల్స్ ఇవ్వాల్సిందేనని.. దానిపై ఉన్న నిషేధం ఎత్తివేయాలని సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుని స్వాగతిస్తూ విజయశాంతి ఫేస్ బుక్ ద్వారా స్పందించారు.

హాట్ గర్ల్ గా మారిన తెలుగమ్మాయి.. అంజలి ఫోటోలు!

ఐపీఎస్ అధికారిగా, లెక్చరర్‌గా, ప్రొఫెసర్‌గా, లాయర్‌గా, సీబీఐ అధికారిగా, మహిళా మంత్రిగా, ఆటోడ్రైవర్‌గా, ముఖ్యమంత్రిగా, జర్నలిస్టుగా, పారిశ్రామికవేత్తగా, అమాయకంతో నిండిన నిజాయితీ ఆడబిడ్డగా, అణగారిన వర్గాల హక్కులపై తిరగబడ్డ ఉద్యమ కారిణిగా... ఇంకా ఎన్నో, ఎన్నెన్నో అసంఖ్యాక పాత్రలతో మహిళలలో స్ఫూర్తి నింపే అవకాశం సుదీర్ఘమైన తన సినీ ప్రయాణం 1979 నుంచి ఇప్పటివరకు ప్రేక్షక దైవాలు ఆశీస్సులతో తనకు లభించిందని అన్నారు.

వీటిలో తను నటించిన  బహుభాషా చిత్రం 'భారతరత్న'లో పోషించిన ఆర్మీ కమాండర్ పాత్ర తనతో పాటు తెలుగు ప్రేక్షకులకు ఎప్పటికీ గుర్తిండిపోతుందని అన్నారు. రెండు దశాబ్దాల క్రితం తను పోషించిన ఆర్మీ ఆఫీసర్ పాత్రను వాస్తవ రూపంలోకి తెచ్చేవిధంగా సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు మహిళా సాధికారతకు స్ఫూర్తినిచ్చే విధంగా ఉందని అన్నారు. .

సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుతో 20 ఏళ్ల క్రితం తను ఆర్మీ ఆఫీసర్‌గా కన్న కల ఇప్పుడు సాకారం అయిందని అన్నారు. అన్ని రంగాల్లో రాణిస్తున్న మహిళలు సైన్యాన్ని ముందుండి నడిపించడంలో తమ వంతు పాత్ర పోషిస్తారనడంలో ఎలాంటి సందేహం లేదని విజయశాంతి సోషల్ మీడియాలో చెప్పుకొచ్చారు. 

Follow Us:
Download App:
  • android
  • ios