సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన తాజా చిత్రం సరిలేరు నీకెవ్వరు. అనిల్ రావిపూడి దర్శకత్వంలో మహేష్ ఆర్మీ మేజర్ గా నటించిన ఈ చిత్రంపై ఆకాశాన్ని తాకే అంచనాలు ఉన్నాయి. లేడి అమితాబ్ విజయశాంతి 13 ఏళ్ల తర్వాత రీ ఎంట్రీ ఇస్తున్న చిత్రం ఇది. సంక్రాంతి కానుకగా రిలీజ్ కాబోతున్న ఈ చిత్రం ప్రీరిలీజ్ వేడుకని నేడు ఎల్బీస్టేడియంలో ఘనంగా నిర్వహిస్తున్నారు. తొలిసారి మెగాస్టార్ చిరంజీవి మహేష్ బాబు చిత్రం కోసం చీఫ్ గెస్ట్ గా హాజరయ్యారు. 

మెగాస్టార్ చిరంజీవి చేతుల మీదుగా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో సరిలేరు నీ కెవ్వరు థియేట్రికల్ ట్రైలర్ లాంచ్ అయింది. ట్రయిలర్ గురించి ఒక్క మాటలో చెప్పాలంటే ఈ సంక్రాంతికి అనిల్ రావిపూడి పర్ఫెక్ట్ మాస్  ఎంటర్టైనర్ ని సిద్ధం చేశాడు. తన మార్క్ హాస్యం ఉంటూనే.. మహేష్ బాబుని పవర్ ఫుల్ గా చూపించాడు. డైలాగులు కూడా బాగా పేలాయి. 

సరిలేరు ప్రీరిలీజ్: చిరు, విజయశాంతి సినిమాల పేర్లు చెప్పగానే.. రష్మిక చెప్పిన సీక్రెట్!

రష్మిక, బండ్ల గణేష్, రాజేంద్ర ప్రసాద్, సంగీతతో ట్రైన్ ఎపిసోడ్ లో మహేష్ చేస్తున్న కామెడీ బావుంది. ఈ చిత్రంలో అనిల్ రావిపూడి 'నెవ్వరు బిఫోర్..ఎవ్వరు  ఆఫ్టర్' అనే ఊత పదాన్ని ఉపయోగించాడు. '15 ఏళ్ల ప్రొఫెషనల్ కెరీర్.. ఇంత వరకు తప్పుని రైట్ అని కొట్టలేదు' అంటూ విజయశాంతి చెబుతున్న డైలాగ్ ఆసక్తికరంగా ఉంది. 'చిన్న బ్రేక్ ఇస్తున్నాను.. తర్వాత బొమ్మ దద్దరిల్లిపోద్ది' అంటూ మహేష్ చివర్లో డైలాగ్ తో అదరగొట్టాడు. ట్రైలర్ పై మీరూ ఓ లుక్కేయండి.