రాజకీయాల్లో ఒకరిపై ఒకరు చేసుకునే విమర్శలు ఎలా ఉంటాయో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. రాజకీయ నాయకులు దిగజారి ఒకరిపై ఒకరు వ్యక్తిగత దూషణలకు దిగడం చూస్తూనే ఉన్నాం. తాజాగా మెగా బ్రదర్ నాగబాబు, వైసిపి రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి తీవ్రస్థాయిలో ఒకరిపై ఒకరు విరుచుకుపడుతున్నారు. 

ఈ నేపథ్యంలో విజయసాయి రెడ్డి.. పవన్ కళ్యాణ్, నాగబాబులని ఉద్దేశిస్తూ చేసిన వ్యాఖ్యలు తీవ్ర వివాదంగా మారాయి. కరోనా విపత్కర సమయంలో విమర్శల జోలికి వెళ్లకుండా నియంత్రణ పాటిస్తున్నాం అని పవన్ కళ్యాణ్ అన్నారు. దీనికి విజయ్ సాయి రెడ్డి ట్విట్టర్ వేదికగా బదులిస్తూ.. అసలు రాజకీయాలు చేయడానికి జనసేన పార్టీకి గ్రౌండే లేదు అని విమర్శించారు. 

గుత్తాజ్వాల, అమలాపాల్ వల్లే భార్యకు విడాకులా ?.. హీరో సమాధానం ఇదే

దీనికి నాగబాబు బదులిస్తూ.. ఎదవరాజకీయాలు చేయడానికి నీలాంటి గుంటనక్కలు ఉన్న సంగతి మాకు తెలుసు విజయసాయి రెడ్డి అని తీవ్రంగా విమర్శించారు. తిరిగి విజయసాయి రెడ్డి బదులిస్తూ పవన్, నాగబాలుపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. 

'పావలా బ్యాచ్ కి రోషం పొడుచుకొచ్చినట్లు ఉంది. సినిమాలు, టీవీ షోలు చేసుకుంటూ పార్టీని గాలికి వదిలేసే వారికి రాజకీయాలు ఎందుకు.. 2014లోనే మేము పొత్తులు పెట్టుకోలేదు. పొత్తులు ఉండవని జగన్ గారు స్పష్టంగా ప్రకటించారు. చిరంజీవి గారి తమ్ముళ్లు కాకపోతే కుక్కలు కూడా మొరగవు అంటూ విజయసాయి రెడ్డి చేసిన వ్యాఖ్యలు కలకలం సృష్టిస్తున్నాయి.