కరుణామయుడు విజయ్ చందర్ తన తాతగారైన ఆంధ్ర కేసరి టంగుటూరి ప్రకాశం పంతులు జీవిత గాధను ఆంధ్ర కేసరి టైటిల్ తో అప్పట్లో సినిమా గా తీసారు.  విజయ్ చందర్ కు అప్పటికి, ఇప్పటికి ముక్కుసూటి మనిషి అని పేరు. మనస్సులో ఉన్నది మొహమాటం లేకుండా మాట్లాడేస్తారు. అది చాలా మంది శత్రువులను తెచ్చిపెట్టినా వెనకాడరు. అప్పట్లో అలాగే ఎన్టీఆర్ రాజకీయరంగ జీవితంపై కొన్ని కామెంట్స్ చేసారు.  అప్పట్లో ఎన్టీఆర్ పై పోటీ చేస్తాను అని స్టేట్మెంట్ ఇవ్వటంతో అది సంచలనమైంది.  దాంతో ఆయన హైదరాబాద్ వచ్చినప్పుడు అప్పటి సినిమా పత్రిక ఆయన్ని ఈ విషయమై ప్రశ్నించింది. దానికి విజయ్ చందర్ సమాధానమిచ్చారు.

కార్తీకదీపం' హీరో ఇంటికి పవన్ కళ్యాణ్ మామిడి పళ్ళు.. ఎందుకు పంపారంటే!

విజయ్ చందర్ మాట్లాడుతూ... నేను పత్రికల వారితో చెప్పింది ఒకటి, వాళ్లు రాసింది మరొకటి. నేను పత్రికల వారికి అర్దమయ్యేటట్లు చెప్పలేకపోయానా నేను చెప్పింది వాళ్లు సరిగ్గా అర్దం చేసుకోలేదా నాకు మాత్రం అర్దం కాలేదు. అని ఓ పత్రిక పేరుని సూచించారు.  అలాగే రాజకీయాల్లోకి ప్రవేశించాలని నాకు అయిడియా లేదు. ఎన్టీఆర్ తో  పోటీ చేస్తానని  ప్రకటనలు ఇచ్చి చీప్ పబ్లిసిటీ సంపాదించుకోవాల్సిన  అవసరం అంతకన్నా లేదు అన్నారు.

ఇక ఎన్టీఆర్ ను నేను నటుడిగా అభిమానిస్తాను. అతను నటించిన ప్రతీ చిత్రాన్ని అయిదారు సార్లు అయినా చూసే వాడిని. అతనంటే అంత అభిమానం. ఎన్టీఆర్ పార్టీ పెడుతున్నారంటే ఆనందం కలిగింది. ఎన్టీఆర్ క్రమ శిక్షణ కలిగిన వ్యక్తి. ఆయనకు ఉన్న పాపులారిటీ, ఫాలోయింగ్ వల్ల రాష్ట్రానికి ఎంతో సేవ చేయవచ్చును. తను కష్టపడి సంపాదించిన దాంట్లో కొంతైనా ప్రజలకు ఇచ్చి ఉంటే ఎన్టీఆర్ మరో ప్రకాసం అయ్యేవారు. 30 సంవత్సరాలుగా ఆయన పరిశ్రమలో ఉంటూ పరిశ్రమలోని అయిదువేలమందికి ఎలాంటి సహాయం చేయలేదు. ఆ విషయం పరిశ్రమలోని వారందరికీ తెలుసు. అలాంటి వ్యక్తి ఆరు కోట్ల ఆంధ్రులకు ఎలాంటి సేవ చేస్తాడని నాకు అనిపించింది.సినిమా పవర్ ఫుల్ మీడియా. దాని ద్వారా సమాజానికి సేవ చేద్దామనే ఉద్దేశ్యంతో అక్కినేని , ఆదుర్తి సుబ్బారావు తో కలిసి సుడిగుండాలు,మరో ప్రపంచం సినిమా  తీసారు. డబ్బు రావచ్చు, నష్టం రావచ్చుఅది వేరే విషయం.  అలాంటి ప్రయోగాలు కానీ ప్రయత్నాలుకాని ఎన్టీఆర్ సినిమాల్లో నాకు ఎక్కడా కనపించదు.

అలాగే కృష్ణ.. నటుడుగా ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొని, నటుడుగా నిలబడి, ఆర్ధికంగా ఎంతో మందికి సాయిపడుతున్నారు. కానీ రామారావు గారు సీనియర్ ఆర్టిస్ట్ గా ఉండి పరిశ్రమలో ఏ విధమైన సాయం చేయలేదని పరిశ్రమలో ప్రతీ ఒక్కరికీ తెలుసు.


ఎన్టీఆర్ రాష్ట్రంలో కరువు బాధితులుకు, వరద బాధితులకు నిధులు వసూలు చేసి ఇచ్చారే తప్ప తన సంపాదనలోంచి ఒక్క పైసా కూడా ప్రజలకోసం ఉపయోగించలేదు. తనకు ఉన్న ఆస్ది పాస్తులలో కనీసం మూడో వంతైనా దేశానికి సమర్పించి తన త్యాగ భావాన్ని ఆయన రుజువు చేసుకోవాలి. తన ఆస్దిని ప్రజల ఉపయోగానికి వినియోగిస్తూ ప్రజల్లోకి వెళ్తున్నారా అంటే అదీ లేదు.

ఆంధ్రకేసరి ,వీరేశలింగం, డాక్టర్ అంబేత్కర్ వీరంతా ఆదర్శం అన్నారు. వారి అడుగు జాడల్లో నడుస్తాను అన్నారు. ఈ విషయం నాకు చాలా బాధ కలిగించింది. బీ ప్రజల కష్ట సుఖాలు ఎన్టీఆర్ కు తెలుసా.. ఆంధ్రకేసరిలా ఎన్టీఆర్ కూడా తన సర్వస్వం ప్రజా సంక్షేమానికి ఉపయోగిస్తూ ఈ మాట అంటే బాగుండేది. ఇన్నాళ్లుగా రానీ ఈ ప్రజా సేవ ఆలోచన ఈయనలో హఠాత్తుగా రావటం ఆశ్చర్యం కలిగిస్తుంది అన్నారు విజయ్ చందర్.