మెగా ఫ్యామిలీ నుంచి వస్తున్న మరో యువ హీరో వైష్ణవ్ తేజ్. సాయిధరమ్ తేజ్ సోదరుడైన వైష్ణవ్ ఉప్పెన చిత్రంతో హీరోగా పరిచయమవుతున్నాడు. డెబ్యూ దర్శకుడు బుచ్చిబాబు ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. అదే విధంగా కృతి శెట్టి ఈ చిత్రంతో హీరోయిన్ గా  పరిచయం అవుతోంది. 

ఈ చిత్రంలో తమిళ విలక్షణ నటుడు విజయ్ సేతుపతి ప్రతినాయకుడి పాత్రలో  తెలిసిందే. దాదాపుగా షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఏప్రిల్ లో రిలీజ్ కు కూడా రెడీ అయింది. ఇంతలో కరోనా రావడంతో షూటింగ్ నిలిచిపోయింది. 

తాజగా విజయ్ సేతుపతి ఉప్పెన చిత్రంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఉప్పెన చిత్రం తన కల్ట్ మూవీ 96 కంటే డెప్త్ ఉన్న ప్రేమ కథ అని.. పెద్ద విజయం సాధిస్తుంది అని కితాబిచ్చాడు. 

ఆ సినిమా చూసే రాజమౌళి నన్ను బాహుబలిలో తీసుకున్నారు: రానా

విజయ్ సేతుపతి, త్రిష జంటగా నటించిన 96 చిత్రం బ్లాక్ బస్టర్ గా నిలిచింది. విజయ్ సేతుపతి కెరీర్ లోనే ఇది పెద్ద విజయంగా నిలిచింది. ఉప్పెన అంతకంటే పెద్ద విజయం సాధిస్తుందని ఏకంగా విజయ్ సేతుపతే చెప్పడంతో ఈ చిత్రంపై అంచనాలు పెరిగాయి. 

మైత్రి మూవీస్ సంస్థ నిర్మిస్తున్న ఈ చిత్రానికి సుకుమార్ కథ అందిస్తుండగా, దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు.