రామానాయుడు ఇండియాలోనే తిరుగులేని నిర్మాతగా ఎదిగారు. ఆయన వారసులుగా సురేష్ బాబు నిర్మాతగా, వెంకటేష్ స్టార్ హీరోగా రాణిస్తున్న సంగతి తెలిసిందే. దగ్గుబాటి కుటుంబంలో మూడో తరం హీరో రానా దగ్గుబాటి. రానా కమర్షియల్ చిత్రాల మూసలో చిక్కుకోకుండా విలక్షణ నటుడిగా ఎదుగుతున్నాడు. 

బాహుబలి చిత్రం రానాకు జాతీయవ్యాప్తంగా గుర్తింపు తీసుకువచ్చింది. అలాగే ఘాజి చిత్రంతో రానా ప్రశంసలు దక్కించుకున్నాడు. బాహుబలి చిత్రంలో రానా పోషించిన భల్లాల దేవుడు పాత్ర ఒక చరిత్రాత్మకం. 

అక్కడ యావరేజ్.. ఇక్కడ సూపర్ హిట్.. దూసుకుపోతున్న గోపీచంద్ మూవీ

ఆ చిత్రంలో తనని ఎంపిక చేయడానికి గల కారణాన్ని రానా ఓ ఇంటర్వ్యూలు వివరించాడు. అంతకు ముందు రానా క్రిష్ దర్శత్వంలో కృష్ణం వందే జగద్గురుమ్ అనే చిత్రంలో నటించాడు. ఈ చిత్రంలో రానా నట విశ్వరూపమే ప్రదర్శించాడు. రానా నటనకు ప్రశంసలు కూడా దక్కాయి. 

ఈ చిత్రాన్ని రాజమౌళి గారు చూశారని.. చూసిన వెంటనే భల్లాల దేవుడు పాత్రకు తనని ఎంపిక చేశారని రానా తాజాగా ఓ ఇంటర్వ్యూలో వివరించాడు. రానా ప్రస్తుతం బహుభాషా చిత్రం అరణ్యలో నటిస్తున్నాడు.