అల్లు అర్జున్ తన 20వ ప్రాజెక్ట్ ని టాలెంటెడ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో చేస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే కొంత షూటింగ్ ని పూర్తి చేసిన బన్నీ ఇటీవల 'అల..వైకుంఠపురములో' ప్రమోషన్స్ కారణంగా కొంత గ్యాప్ ఇచ్చారు. ఇక నెక్స్ట్ ఎలాంటి గ్యాప్ లేకుండా సుకుమార్ సినిమాని పూర్తి చేయనున్నాడు. అయితే ఈ సినిమాలో విజయ్ సేతుపతి నటిస్తున్న విషయం తెలిసిందే.

విలన్ పాత్రలో కనిపించబోతున్నట్లు టాక్ వస్తోంది. ఇకపోతే విలన్ రోల్ కోసం విజయ్ రెమ్యునరేషన్ గట్టిగా డిమాండ్ చేసినట్లు తెలుస్తోంది. ఈ సినిమాలో విజయ్ సేతుపతి - బన్నీ ల మధ్య భారీ ఫైట్స్ ఉంటాయట. దాదాపు 10కోట్ల వరకు పారితోషికం అందుకున్నట్లు సమాచారం. మరోవైపు కోలీవుడ్ హీరో ఇళయదళపతి విజయ్ 'మాస్టర్' లో కూడా ఈ విజయ్ సేతుపతి నెగిటివ్ షేడ్స్ ఉండే పాత్రలో నటిస్తున్నాడు.  హీరోగానే కాకుండా ఇలా డిఫరెంట్ గా కూడా ట్రై చేస్తూ విజయ్ సేతుపతి తన క్రేజ్ పెంచుకుంటున్నాడు.

ప్రయోగాలకు తగ్గట్లు ఆదాయాన్ని కూడా పెంచుకుంటున్నాడు. మరోవైపు మెగా మేనల్లుడు వైష్ణవ్ తేజ్ సినిమాలో కూడా విజయ్ నెగిటివ్ రోల్ లోనే కనిపించనున్నాడు. మొత్తంగా 2020లో విజయ్ సేతుపతి బిగ్ స్క్రీన్ పై నెగిటివ్ పాత్రలుతోనే హడావుడి చేయనున్నాడని చెప్పవచ్చు. మరీ ఆ పాత్రలు ఈ హీరోగారికి ఎంతవరకు కలిసొస్తాయా చూడాలి.   ఇక బన్నీ 20వ సినిమా నెక్స్ట్ షెడ్యూల్ ని ఫిబ్రవరిలో మొదలుపెట్టాలని డిసైడ్ అయ్యాడు.

సుకుమార్ ఈ సినిమాని చాలా డిఫరెంట్ గా తెరకెక్కిస్తున్నట్లు తెలుస్తోంది.  గత కొన్ని నెలలుగా సుకుమార్ - అల్లు అర్జున్ కొత్త ప్రాజెక్ట్ పై అనేక రకాల రూమర్స్ వస్తున్న సంగతి తెలిసిందే. సినిమా ఆగిపోయిందని కొన్ని రూమర్స్ వచ్చాయి. కానీ ఎట్టకేలకు డీప్ డిస్కర్షన్స్ తో బన్నీ స్క్రిప్ట్ లాక్ చేసుకున్నాడు. ఎర్రచందనం స్మగ్లింగ్ కి సంబందించిన కాన్సెప్ట్ తో ఈ సినిమా తెరకెక్కుతున్నట్లు టాక్ వచ్చింది.

ఆర్య సిరీస్ అనంతరం వీరి కాంబినేషన్ లో సినిమా సెట్టయ్యింది అనగానే ఆడియెన్స్ లో అంచనాల డోస్ తారా స్థాయికి చేరుకుంటోంది. మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ సినిమాలో హీరోయిన్ గా రష్మిక మందన్నా నటిస్తోంది. ఇక ఎప్పటిలానే సుకుమార్ తన సినిమాకు రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ ని సెలెక్ట్ చేసుకున్నాడు. త్వరలోనే సినిమా రెగ్యులర్ షూటింగ్ ని  గ్యాప్ లేకుండా పూర్తి చేసి టైటిల్ అండ్ ఫస్ట్ లుక్ ని రిలీజ్ చేయాలనీ అనుకుంటున్నారు.

అల్లు అర్జున్ - సుకుమార్ ప్రాజెక్ట్.. లేటెస్ట్ అప్డేట్!