అల..వైకుంఠపురములో సక్సెస్ తో మళ్ళీ ఫామ్ లోకి వచ్చిన స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నెక్స్ట్ కూడా ఇలాంటి సక్సెస్ తోనే రావాలని స్ట్రాంగ్ గా ప్లాన్ చేసుకుంటున్నాడు. అల్లు అర్జున్ తన 20వ సినిమాని సుకుమార్ దర్శకత్వంలో చేస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే సినిమాని లాంచ్ చేసిన బన్నీ ఇటీవల అల వైకుంఠపురములో ప్రమోషన్స్ కోసం కొంత గ్యాప్ ఇచ్చాడు.

ఇక నెక్స్ట్ షెడ్యూల్ ని ఫిబ్రవరిలో మొదలుపెట్టాలని డిసైడ్ అయ్యాడు. సుకుమార్ ఈ సినిమాని చాలా డిఫరెంట్ గా తెరకెక్కిస్తున్నట్లు తెలుస్తోంది.  గత కొన్ని నెలలుగా సుకుమార్ - అల్లు అర్జున్ కొత్త ప్రాజెక్ట్ పై అనేక రకాల రూమర్స్ వస్తున్న సంగతి తెలిసిందే. సినిమా ఆగిపోయిందని కొన్ని రూమర్స్ వచ్చాయి. కానీ ఎట్టకేలకు డీప్ డిస్కర్షన్స్ తో బన్నీ స్క్రిప్ట్ లాక్ చేసుకున్నాడు. ఎర్రచందనం స్మగ్లింగ్ కి సంబందించిన కాన్సెప్ట్ తో ఈ సినిమా తెరకెక్కుతున్నట్లు టాక్ వచ్చింది.

ఆర్య సిరీస్ అనంతరం వీరి కాంబినేషన్ లో సినిమా సెట్టయ్యింది అనగానే ఆడియెన్స్ లో అంచనాల డోస్ తారా స్థాయికి చేరుకుంటోంది. మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ సినిమాలో హీరోయిన్ గా రష్మిక మందన్నా నటిస్తోంది. ఇక ఎప్పటిలానే సుకుమార్ తన సినిమాకు రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ ని సెలెక్ట్ చేసుకున్నాడు. త్వరలోనే సినిమా రెగ్యులర్ షూటింగ్ ని  గ్యాప్ లేకుండా పూర్తి చేసి టైటిల్ అండ్ ఫస్ట్ లుక్ ని రిలీజ్ చేయాలనీ అనుకుంటున్నారు.