ఒక హీరో కోసం తయారు చేసుకున్న కథ ఆ హీరో డేట్స్ ఖాళీలేకో మరో వేరే ఇతర కారణాలతోనే వేరేవారితో చేస్తూండటం ఇండస్ట్రీలో సర్వ సాధారణంగా జరిగే విషయమే. అయితే మొదట అనుకున్న హీరోకు సమ ఉజ్జీలాంటి హీరోనే వెతికి పట్టుకుంటూంటారు. అలాగని మరీ చిరంజీవితో అనుకున్న కథను సాయి ధరమ్ తేజ తో చేసాను అని చెప్తేనే కాస్త కంగారుపడతాం. ఇప్పుడు పవన్ కళ్యాణ్ కోసం తయారు చేసుకున్న కథను విజయ్ సేతుపతి తో చేసాను ఓ తమిళ దర్శకుడు చెప్పి అందరినీ ఆశ్చర్యపరిచారు.

మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి హీరోగా తమిళంలో  తెరకెక్కిన చిత్రం ‘సంగతమిళన్’. రాశీఖన్నా హీరోయిన్. నివేద పేతురాజ్ మరో కీలక పాత్రలో నటించారు. ఈ సినిమాను తెలుగులో ‘విజయ్ సేతుపతి’ టైటిల్‌తో రిలీజ్ చేస్తున్నారు. ఈనెల 15న రెండు భాషల్లో ఒకేసారి విడుదలవుతోంది. ఈ నేపధ్యంలో దర్శకుడు దర్శకుడు విజయ్ చందర్ మాట్లాడుతూ...తాను మొదట ఈ కథను పవన్ కోసం చేసానని వెళ్లడించారు. . కానీ, పవన్ రాజకీయాలతో బిజీ అయిపోవడంతో విజయ్ సేతుపతితో చేశానని  చెప్పుకొచ్చారు.

మెగా హీరో సినిమా.. చేతులెత్తేసిన నిర్మాత!

అలాగే  ‘విజయ్ సేతుపతి’   కమర్షియల్ మూవీ మాత్రమే కాదనీి,  దీనిలో సోషల్ మెసేజ్ కూడా ఉందని అన్నారు. పవన్ కళ్యాణ్ ఉద్దానం కిడ్నీ సమస్య గురించి పోరాడినట్టే ఈ సినిమాలో విజయ్ సేతుపతి ఒక ప్రజా సమస్య గురించి పోరాడతారని చెప్పుకొచ్చారు. అంతేకాకుండా, ఈ సినిమాలో విజయ్ సేతుపతి ద్విపాత్రాభినయం చేశారని రివీల్ చేసారు.

 అయితే పవన్ బాడీ లాంగ్వేజ్ వేరు..ఆయన చేసే సినిమాలు వేరు. విజయ్ సేతుపతిది వేరే స్కూల్. అలాంటిది పవన్ కథ ..విజయ్ సేతుపతికు ఎలా సెట్టయ్యిందనేది మీడియాలో చర్చగా మారింది. తెలుగులో రిలీజ్ చేస్తున్నారు కాబట్టి ఇక్కడ క్రేజ్ కోసం ఇలా పవన్ టాపిక్ తెచ్చారని సోషల్ మీడియాలో కామెంట్స్ వస్తున్నాయి.

ఇక ఈ దర్శకుడు తెలుగులో సినిమా చేయాలనే తన మనస్సులో కోరక బయట పెట్టాడు.  జూనియర్ ఎన్టీఆర్ వంటి మాస్ హీరోలతో సినిమాలు చేయడమంటే తనకు ఎంతో ఇష్టమని, ఆయన కోసం కథ సిద్ధం చేస్తానని వెల్లడించారు.