మెగాస్టార్ చిరంజీవి రెండో అల్లు కళ్యాణ్ దేవ్ 'విజేత' సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. ఈ సినిమా ఆశించిన స్థాయిలో సక్సెస్ కాలేకపోయింది. అయినప్పటికీ మెగాస్టార్ అల్లుడు కాబట్టి కళ్యాణ్ దేవ్ కి రెండో సినిమా ఛాన్స్ ఈజీగానే వచ్చింది. అదే 'సూపర్ మచ్చి'. పులివాసు డైరెక్ట్ చేస్తోన్న ఈ సినిమా ఫస్ట్ లుక్ ఇటీవల విడుదల చేశారు.

దాదాపు నలభై శాతం షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా ఇప్పుడు ఆగిపోయిందని సమాచారం. రిజ్వాన్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై ఈ సినిమాను నిర్మిస్తున్నాడు. ఇప్పుడు ఆ నిర్మాత సినిమా చేయలేనని పక్కకి తప్పుకున్నట్లు సమాచారం.

ఘాటు అందాలు, సెక్సీ ఫోజులు.. పిచ్చెక్కిస్తోన్న రాశిఖన్నా!

ఇచ్చిన పెట్టుబడి మొత్తం సినిమా సగం పూర్తయ్యేలోపే అయిపోయిందట. పైగా ఈ చిత్ర నిర్మాత తీసిన 'తిప్పరా మీసం' సినిమా ఇటీవల విడుదలై ఫ్లాప్ టాక్ తెచ్చుకుంది. కనీసం ఈ సినిమాతో లాభాలు వస్తే వాటిని 'సూపర్ మచ్చి'పై పెట్టాలని అనుకున్నాడు.

కానీ 'తిప్పరామీసం' సినిమా ఫ్లాప్ అవ్వడంతో నష్టాల్లో కూరుకుపోయిన ఈ నిర్మాత తన తదుపరి సినిమాపై పెట్టుబడి పెట్టే పొజిషన్ లో లేడని అంటున్నారు. ఆ కారణంగానే సినిమాని మధ్యలోనే వదిలేశారని తెలుస్తోంది. మెగాఫ్యామిలీ హీరో సినిమా కాబట్టి మధ్యలోనే ఆగిపోతే చిన్నతనంగా ఉంటుంది.

పైగా కళ్యాణ్ దేవ్ మొదటి సినిమా ఫ్లాప్ అవ్వడం, ఇప్పుడు రెండో సినిమా ఆగిపోవడం జరిగితే ఇండస్ట్రీలో తన కెరీర్ పై పెద్ద దెబ్బ పడుతుంది. కాబట్టి ఈ సినిమాని ఎవరో ఒకరు టేకప్ చేస్తారని తెలుస్తోంది. మరి చిరంజీవి స్వయంగా రంగంలోకి దిగుతారా..? లేక తనకు తెలిసిన నిర్మాతలతో పెట్టుబడి పెట్టిస్తారో చూడాలి!