Asianet News TeluguAsianet News Telugu

'విజిల్' ఎఫెక్ట్ :విజయ్ నెక్ట్స్ ఎంతకి అమ్మారో తెలుసా..?

ప్లాఫ్ టాక్ తెచ్చుకున్నా విజయ్ హీరోగా నటించిన 'విజిల్' సినిమా తెలుగులో 11 కోట్ల వరకు షేర్ సాధించటం ట్రేడ్ ని ఆశ్చర్యపరిచింది.  'విజిల్' సినిమా హక్కులు తొమ్మిదిన్నర కోట్లకి కొన్నారు నిర్మాత మహేష్ కోనేరు. 

Vijay's next telugu rights also bagged by Mahesh Koneru
Author
Hyderabad, First Published Dec 30, 2019, 9:58 AM IST

తమిళ హీరో విజయ్ సినిమాలకు మెల్లిమెల్లిగా తెలుగులోనూ మార్కెట్ పెరుగుతూ వస్తోంది. ఇంతకు ముందు అసలు విజయ్ సినిమాని పట్టించుకునేవారు ఉండేవారు కాదు. ముఖ్యంగా తెలుగు సూపర్ హిట్ సినిమాలు రీమేక్ లను వరసపెట్టి చేయటంతో విజయ్ ...సినిమాలు ఇక్కడ డబ్ చేసి రిలీజ్ చేసినా ఫలితం ఉండేది కాదు. సూర్య, కార్తి తెలుగులో దూసుకుపోతున్న టైమ్ లో విజయ్ సినిమాలు ఇక్కడ మినిమం రిలీజ్ లేని పరిస్దితి ఉంది. అయితే ఇప్పుడు పరిస్దితి మారింది. తుపాకి,  అదిరింది, విజిల్ సినిమాలతో విజయ్ ట్రాక్ మారుతూ వచ్చింది. మినిమం రెవిన్యూలు వస్తున్నాయి.

లారీ డ్రైవర్ గా బన్నీ, షూటింగ్ కు అక్కడ నో ఫర్మిషన్?

ప్లాఫ్ టాక్ తెచ్చుకున్నా విజయ్ హీరోగా నటించిన 'విజిల్' సినిమా తెలుగులో 11 కోట్ల వరకు షేర్ సాధించటం ట్రేడ్ ని ఆశ్చర్యపరిచింది.  'విజిల్' సినిమా హక్కులు తొమ్మిదిన్నర కోట్లకి కొన్నారు నిర్మాత మహేష్ కోనేరు. ప్లాఫ్ కాకుండా ఒడ్డున పడ్డాడు కానీ ఈ ప్రాజెక్టులో మిగిలింది ఏమీ లేదు.

స్ట్రైయిట్ సినిమాకు ఖర్చు పెట్టినట్లుగా మహేష్ కోనేరు ఈ సినిమాకు ప్రమోషన్ చేసారు. ఈ విషయం విజయ్ దృష్టీకి వెళ్లింది.ఇన్నాళ్లుగా తన సినిమాలు తెలుగులో ఆడకపోవటానికి కారణం సరైన ప్రమోషన్ లేదని, ఆ విషయంలో మహేష్ కోనేరు అండగా నిలిచాడని భావించారు. దాంతో తన నెక్స్ట్ మూవీ హక్కులు మహేష్ కోనేరుకే  ఇప్పించాడు విజయ్.

ట్రేడ్ వర్గాల నుంచి అందుతున్న సమాచారం మేరకు ఈ సినిమా రైట్స్ ఎనిమిదిన్నర కోట్లకు దక్కాయి. విజయ్ కొత్త సినిమాని 'ఖైదీ' సినిమా దర్శకుడు లోకేష్ కానగరాజు డైరక్ట్ చేస్తూండటంపై ఈ సినిమాపై మంచి అంచనాలే ఉన్నాయి.ఖైదీ వంటి హిట్ సినిమా తర్వాత ఆ దర్శకుడు తీస్తున్న సినిమా కాబట్టి ఎక్సపెక్టేన్స్ బాగుండి ఖచ్చితంగా ఓపినింగ్స్ ఉంటాయి. సినిమా ఏ మాత్రం బాగున్నా... మహేష్ కోనేరు కు పండుగే.
 

Follow Us:
Download App:
  • android
  • ios