Asianet News TeluguAsianet News Telugu

లారీ డ్రైవర్ గా బన్నీ, షూటింగ్ కు అక్కడ నో ఫర్మిషన్?

అల్లు అర్జున్‌ 20వ చిత్రానికి ప్రముఖ దర్శకుడు సుకుమార్‌ దర్శకత్వం వహించనున్న సంగతి తెలిసిందే.  మైత్రి మూవీ మేకర్స్‌ బ్యానర్‌ నిర్మిస్తున్న ఈ  సినిమా ఎనౌన్స్ చేసి చాలా కాలం అయ్యిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పటిదాకా ప్రాజెక్టు ప్రారంభం కాలేదు. అందుకు కారణం కథ విషయంలో బన్ని కాంప్రమైజ్ కాకపోవటమే అని అన్నారు. 

Allu Arjun's Next could not get the necessary permissions?
Author
Hyderabad, First Published Dec 30, 2019, 7:50 AM IST
  • Facebook
  • Twitter
  • Whatsapp

స్టైలిష్‌స్టార్‌ అల్లు అర్జున్‌ 20వ చిత్రానికి ప్రముఖ దర్శకుడు సుకుమార్‌ దర్శకత్వం వహించనున్న సంగతి తెలిసిందే.  మైత్రి మూవీ మేకర్స్‌ బ్యానర్‌ నిర్మిస్తున్న ఈ  సినిమా ఎనౌన్స్ చేసి చాలా కాలం అయ్యిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పటిదాకా ప్రాజెక్టు ప్రారంభం కాలేదు. అందుకు కారణం కథ విషయంలో బన్ని కాంప్రమైజ్ కాకపోవటమే అని అన్నారు.

శేషాచలం ఫారెస్ట్ లోని ఎర్ర చందనం స్మగ్లింగ్ బ్యాక్ డ్రాప్ లో ఆ కథ రెడీ చేసారు. అయితే ఇప్పుడు అన్ని పనులు పూర్తి చేసుకుని  ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్ లో జనవరి 17 తారీకు నుండి ప్రారంభించటానికి రంగం సిద్దం చేసారు. ఆ రోజు నుంచే అల్లు అర్జున్ జాయిన్ అవుతున్నట్లు  తెలుస్తోంది.  అందుతున్న సమాచారం మేరకు ఈ సినిమాలో బన్నీ పూర్తిస్థాయి మాస్ క్యారెక్టర్లో లారీ డ్రైవర్ పాత్రలో కనిపించబోతున్నట్లు టాలీవుడ్ ఇండస్ట్రీలో వినబడుతున్న టాక్.

అలాగే ఈ సినిమా కోసం శేషాచలం ఫారెస్ట్ లో షూటింగ్ ప్లాన్ చేసారు. అయితే అటవి శాఖ వారు నుంచి ఫర్మిషన్ రాలేదు. అప్పటికీ అల్లు అరవింద్ వంటివారు సీన్ లోకి వెళ్లినా ..రకరకాల రూల్స్ తో టీమ్ కు కావాల్సినన్ని రోజులు, లొకేషన్స్ ఫర్మిషన్ దొరికేటట్లు లేదు. దాంతో సుకుమార్..వెంటనే యాక్షన్ ప్లాన్ మార్చి ఈ సినిమాని బ్యాంకాక్ అడవుల్లో ప్లాన్ చేసినట్లు సమాచారం.  'అలా వైకుంఠపురం లో' సినిమా రిలీజ్ అయ్యాక సుకుమార్ సినిమా పై దృష్టి పెట్టేనున్నారుట బన్నీ.

అంతేకాకుండా కంటిన్యూ షెడ్యూల్స్ తో కంప్లీట్ చేసి సమ్మర్ కల్లా విడుదల చేయాలనే ప్లాన్ లో అల్లు అర్జున్ ఉన్నట్టు సమాచారం. ఇక  సుకుమార్-బన్నీలది క్రేజీ కాంబినేషన్‌. వీరిద్దరూ కలిసి ‘ఆర్య’, ‘ఆర్య 2’ వంటి బ్లాక్‌బస్టర్‌ చిత్రాలను ప్రేక్షకులకు అందించారు. బన్నీ నటించిన ‘ఐ యామ్‌ దట్‌ చేంజ్‌’ అనే షార్ట్ ఫిలింకు సుకుమార్‌ నిర్మాతగా వ్యవహరించారు. చాలా ఏళ్ల తర్వాత మళ్లీ వీరిద్దరూ ప్రేక్షకులను సర్‌ప్రైజ్‌ చేయడానికి సిద్ధమయ్యారు.

మరో ప్రక్క అల్లు అర్జున్ తన తాజా చిత్రం అల వైకుంఠపురములో సినిమా ప్రమోషన్స్ లో  బిజీగా ఉన్నారు. పూజ హెడ్గే, నివేదిత పేతు రాజ్ హీరోయిన్స్ గా చేస్తున్న  ఈ సినిమా సంక్రాంతికి విడుదలకు సిద్దమవుతోంది. ఇప్పటికే విడుదలైన సామజవరగమన పాట పెద్ద హిట్ అయ్యింది.‘జులాయి’, ‘సన్నాఫ్‌ సత్యమూర్తి’ తర్వాత అల్లు అర్జున్‌ - త్రివిక్రమ్‌ కాంబినేషన్‌లో రూపొందుతున్న చిత్రమిది.

Follow Us:
Download App:
  • android
  • ios