ప్రస్తుతం సోషల్ మీడియా యుగం నడుస్తోంది. ప్రపంచం నలుమూలల ఎలాంటి సంఘటన జరిగినా సోషల్ మీడియా వేదికగా క్షణాల్లో తెలిసిపోతోంది. సామజిక మాధ్యమాల్లో ప్రభావం చూపుతున్న సంస్థల్లో ట్విట్టర్ కూడా ఒకటి. సామాన్య ప్రజల నుంచి బడా రాజకీయ నాయకులు, కార్పొరేట్ సంస్థలు, సినీ క్రీడా ప్రముఖులు ట్విట్టర్ ని ఉపయోగిస్తున్నారు. 

సోషల్ మీడియా వచ్చాక సినిమా ప్రచారంలో కూడా పెను మార్పులు వచ్చాయి. అభిమానులకు చేరువగా ఉండేందుకు సినీతారలు ట్విట్టర్ ని ఉపయోగిస్తున్నారు. సినీ తారలకు మిలియన్ల కొద్దీ ఫాలోవర్స్ ట్విట్టర్ లో ఉండడం చూస్తూనే ఉన్నాం. ట్విట్టర్ ఇండియా సంస్థ 2019 సంవత్సరానికి గాను నమోదైన రికార్డులని ప్రకటిస్తోంది. 

ఎంటర్టైన్మెంట్ విభాగంలో ఇళయదళపతి విజయ్ అరుదైన ఘనత సాధించాడు. విజయ్ నటించిన బిగిల్ చిత్ర ఫస్ట్ లుక్ ఈ ఏడాది అత్యధిక రీట్వీట్స్, కామెంట్స్ సాధించిన పోస్టర్ గా రికార్డు సృష్టించింది. విజయ్ స్వయంగా బిగిల్ ఫస్ట్ లుక్ ని ట్విటర్ లో రిలీజ్ చేశాడు. ఆ ట్వీట్ అత్యధిక రీట్వీట్స్, కామెంట్స్ సాధించిందని ట్విట్టర్ ఇండియా పేర్కొంది. 

మోసపోయిన బిగ్ బాస్ భామ.. బూతు సినిమాకు అలా ఒప్పేసుకుంది!

బిగిల్ ఫస్ట్ లుక్ కు లక్షకు పైగా రీట్వీట్స్, 2 లక్షలకు పైగా లైక్స్ లభించాయి. అట్లీ దర్శకత్వంలో స్పోర్ట్స్ డ్రామాగా తెరకెక్కిన బిగిల్ చిత్రం దీపావళికి విడుదలయింది. వసూళ్లపరంగా బిగిల్ మంచి విజయం సాధించింది. ఏఈ చిత్రంలో విజయ్ డ్యూయెల్ రోల్ లో తండ్రి కొడుకులుగా నటించాడు. ఫస్ట్ లుక్ పోస్టర్ లో రెండు లుక్స్ రివీల్ చేశారు. 

మటన్ దుకాణంలో ఉండే కొయ్యపై విజయ్ కాలు వేసి కూర్చోవడం వివాదంగా మారింది. కానీ ఆ వివాదం సినిమాపై ఎలాంటి ప్రభావం చూపలేదు. సూపర్ స్టార్ రజనీకాంత్ తర్వాత అంతటి క్రేజ్ తో విజయ్ తమిళనాట దూసుకుపోతున్నాడు. విజయ్ క్రేజ్ కు తాజాగా ట్విట్టర్ లో సాధించిన ఈ రికార్డ్ కూడా ఓ నిదర్శనం.