ఇలయదళపతి విజయ్ హీరోగా నటించిన విజిల్  తమిళనాడులో చక్కని వసూళ్లు సాధించింది. అయితే తెలుగు వెర్షన్ 'విజిల్' మాత్రం అనుకున్న స్దాయిలో వర్కవుట్ కాలేదు. ఇక థియోటర్ లో చూడని వాళ్లు ఈ సినిమాని అమెజాన్ ప్రైమ్ లో చూడటం కోసం వెయిట్ చేస్తున్నారు.

లెక్క ప్రకారం ఈ సినిమా డిసెంబర్ 13 నుంచి స్ట్రీమింగ్ అవ్వాలి. కానీ  హైదరాబాద్ సివిల్ కోర్ట్ ...ఈ డిజిటల్ స్ట్రీమింగ్ ఆపేయమంటూ ఇంటెర్మ్ ఇంజక్షన్ ఆర్డర్స్ ఇచ్చింది.  అందుకు కారణం ...నంది చిన్ని కుమార్ అనే హైదరాబాద్ కు చెందిన ఫిల్మ్ మేకర్ వేసిన కేసు అని తెలుస్తోంది.

ఈ సినిమా తాను పొందిన ఎక్స్‌క్లూజివ్‌ కాపీ రైట్స్‌ ఉల్లంఘించారని కేసు వేయటం జరిగింది. తాను రాసుకున్న  కథని కాపీ కొట్టి సినిమా తీసి విడుదల చేశారని.... న్యాయం చేయాలని రచయిత, ఫిలిం మేకర్‌ డాక్టర్‌ నందిచిన్ని కుమార్‌ డిమాండ్‌ చేస్తూ కోర్టుకు ఎక్కడటంతో ఈ తీర్పు ఇచ్చారు.

అభిమాని బుగ్గ కొరికిన యాంకర్ వర్షిణి.. వీడియో వైరల్!

డాక్టర్‌ నందిచిన్ని కుమార్‌ మాట్లాడుతూ...సత్యమేవజయతే టీవీ రియాలిటీ షో చేసిన అఖిలేష్‌ పాల్‌ నుంచి ‘ఎక్స్‌క్లూజివ్‌’ కాపీ రైట్స్‌ కొనుగోలు చేశానన్నారు. ఆ కథలో యువకుడు స్లమ్‌లో పుట్టి పెరిగి పెద్ద డాన్‌గా ఎదుగుతాడు. కాలక్రమేణా అతడిలో మార్పు వస్తుంది. సాకర్‌ అంటే అతడికి చాలా ఇష్టం కావడంతో ఆట ఆడుతూ జాతీయ జట్టుకు కెప్టెన్‌ అవుతాడు.

కోచ్‌గా మారి మురికివాడలు, రెడ్‌లైట్‌ ఏరియాలో చిన్నారులకు సాకర్‌ నేర్పుతుంటాడు. ఈ కథ కొనుగోలు చేసి సినిమా తీయడానికి స్ర్కిప్ట్‌ రాసుకున్నానని తెలిపారు. రీసెంట్ గా విడుదలైన బిజిల్‌(తమిళం),విజిల్‌ (తెలుగు) సినిమాల మూడుసార్లు చూసి అది తన కథేనని నిర్ధారించుకున్నానన్నారు.

తాను ప్రోమో చూసినప్పుడే ఎక్స్‌క్లూజివ్‌ రైట్స్‌ అమ్మిన అఖిలేష్‌ పాల్‌కి, సినిమా నిర్మించిన ఏజీఎస్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ సంస్థ, రచయిత, దర్శకుడు అట్లీ దృష్టికి తీసుకెళ్లినా ఫలితం లేదన్నారు.  దీనిపై తెలంగాణ సినిమా రైటర్స్‌ అసోసియేషన్‌, సీబీఎ్‌ఫసీకి కూడా ఫిర్యాదు చేశానన్నారు. ఫలితం లేకపోవడంతో ఈనెల 26న గచ్చిబౌలి పోలీ్‌సస్టేషన్‌లో ఫిర్యాదు చేశానని చెప్పారు. న్యాయం కోసం కోర్టును ఆశ్రయించానని, తన వద్ద కాపీ రైట్స్‌ ఉన్నా అన్యాయం జరిగిందని వాపోయారు.